గ్రూప్‌-4 మూడో విడత సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఎప్పుడో తెలుసా..?

గ్రూప్‌-4 మూడో విడత సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఎప్పుడో తెలుసా..?
x
Highlights

రెండేళ్ల క్రితం టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌–4 పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల్లో కొంత మంది ఇప్పటికే విధుల్లో చేరారు.

రెండేళ్ల క్రితం టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌–4 పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల్లో కొంత మంది ఇప్పటికే విధుల్లో చేరారు. మరికొంత మంది మాత్రం తమ సర్టిఫికెట్ వేరిఫికేషన్ తీదీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ శుభవార్తను తెలిపింది. మూడో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీని ఖరారు చేసింది. 2018 సంవత్సరంలో నిర్వహించిన గ్రూప్–4 పరీక్షలో జూనియర్‌ అసిస్టెంట్, టైపిస్టు, జూనియర్‌ స్టెనో, జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్టు పోస్టుల భర్తీకి సంబంధించి అర్హులైన అభ్యర్థులకు వచ్చే నెల 4 నుంచి 7 వరకు మూడో విడత సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.

ఈ వేరిఫికేషన్ ను హైదరాబాద్ లోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఇందుకు హాజరవ్వాల్సిన అభ్యర్థులు కార్యాలయానికి ఉదయం 10 గంటల వరకు చేరుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా అర్హులైన అభ్యర్థులు పోస్టులు, జోన్ల ప్రాధాన్యతలను బట్టి వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది. ఎవరైతే వెబ్‌ ఆప్షన్లను పెట్టుకుంటారో దాన్నే ప్రాధాన్యతగా తీసుకుని అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుందని పేర్కొంది.

పూర్తి వివరాలకు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ఇకపోతే వెరిఫికేషన్‌కు ఎంతమంది అయితే అభ్యర్థులు హాజరవుతారో వారికి మార్చి 8వ తేదీన కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్టు నిర్వహిస్తామని తెలిపింది. అర్హులైన వారు ఖచ్చితంగా ఉదయం 10 గంటల వరకు కార్యాలయానికి రావాలని, వారికి సంబంధించి సరైన ధృవపత్రాలను అన్నింటిని తీసుకురావాలని తెలిపారు.

షెడ్యూల్ పూర్తి వివరాల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories