గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు

తెలుగు రాష్ట్రాల్లో దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి ఆలయాలకు...
తెలుగు రాష్ట్రాల్లో దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి ఆలయాలకు పోటెత్తుతున్నారు. కొంగు బంగారు తల్లి దుర్గమ్మకు భక్తులు తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా అన్ని చర్యలను అధికారులు చేపట్టారు. మరో వైపు తెలంగాణ ప్రజలకు రాష్ర్ట గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అని తెలిపారు. దుర్గా మాత ఆశీస్సులతో మనం చేసే మంచి పనులన్నిటి లో విజయం సాధించాలని ఆశిస్తున్నాను. చెడు మీద ధర్మం సాధించిన విజయమే విజయ దశమి. కోవిడ్ నివారణ నిభందనలు పాటించండి. దసరాను ఆరోగ్యకరంగా జరుపుకోవాలని గవర్నర్ తెలిపారు.
అదే విధంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు సత్యం, దర్మం సహనం తోడుగా మనిషి తన లోపలి చెడు గుణాల్ని బయట సవాళ్ళని అధిగమించవచ్చునని ఈ పర్వదినం ఇస్తున్న సందేశం.. రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు అయిరారోగ్యలూ ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ తెలంగాణ పెద్ద పండగను కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జరుపుకోవాలని తెలుపుతూ దసరా శుభాకాంక్షలు అని కేసీఆర్ ట్వీట్ చేశారు.
సీఎం జడన్ శుభాకాంక్షలు తెలుపుతూ చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుంది. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ శుభాలు కలగాలని,అన్నింటా విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు అని జగన్ ట్వీట్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) October 25, 2020
దుర్గా మాత ఆశీస్సులతో మనం చేసే మంచి పనులన్నిటి లో విజయం సాధించాలని ఆశిస్తున్నాను. చెడు మీద ధర్మం సాధించిన విజయమే విజయ దశమి.కోవిడ్ నివారణ నిభందనలు పాటించండి. దసరా ను ఆరోగ్యకరంగా జరుపుకొండి.Happy Dussehra to every family 💐💐💐 pic.twitter.com/EYaZhndkXv