ఐదుగురు సమాచార కమిషనర్ల నియామకం

ఐదుగురు సమాచార కమిషనర్ల నియామకం
x
Highlights

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం కమిషనర్లను నిన్న(ఫిబ్రవరి 10) న నియమించింది. నమస్తే తెలంగాణ దినపత్రి ఎడిటర్‌ కట్టా శేఖర్‌ రెడ్డి,...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం కమిషనర్లను నిన్న(ఫిబ్రవరి 10) న నియమించింది. నమస్తే తెలంగాణ దినపత్రి ఎడిటర్‌ కట్టా శేఖర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ లీడర్ గుగులోతుశంకర్‌ నాయక్‌, టీ–న్యూస్‌ సీఈఓ ఎం నారాయణ రెడ్డి, న్యాయవాదులు సయ్యద్‌ ఖలీలుల్లా, మహ్మద్‌ అమీర్‌‌లను నియమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్‌గా రాజా సదారాం, సభ్యుడిగా బుద్ధా మురళి ఇప్పటికే కొనసాగుతున్నారు. వీరితో పాటు మరో ఐదుగురిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.


నేపధ్యం ఇదే :

1) కట్టా శేఖర్‌ రెడ్డి:

2014 నుంచి ఈయన నమస్తే తెలంగాణ దినపత్రికకు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు అంటే 2010 నుంచి 2014 వరకు నమస్తే తెలంగాణకు సీఈవోగా పని చేశారు. ఈయన నల్గొండ ప్రాంతానికి చెందినవారు.

2) ఎం నారాయణ రెడ్డి:

మైడ నారాయణ రెడ్డి 2009 నుంచి టీ న్యూస్‌ ఎడిటర్‌, సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. 1995లో వార్త పత్రికలో సబ్‌ ఎడిటర్‌గా తన కెరీర్ ని ప్రారంభించి ఆంధ్రజ్యోతి, సాక్షి, హెచ్‌ఎంటీవీలలో చేశారు. 2014 నుంచి 2019 వరకు ప్రెస్‌ అకాడమీ కమిటీ మెంటార్‌గా వ్యవహరించారు. ఈయన సిద్ధిపేట ప్రాంతనికి చెందినవారు.

3) ఎండీ అమీర్‌:

ఈయన వృత్తి రీత్యా న్యాయవాది .. ఫ్రీ మెడికల్‌ క్యాంపులు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పిల్లల హక్కులు, బాల కార్మిక వ్యవస్థ, విడాకులు పొందిన పేద మహిళల తరపున ఎంజీవోలతో కలిసి చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈయన హైదరాబాద్‌ ప్రాంతనికి చెందినవారు.


4 ) సయ్యద్‌ ఖలీలుల్లా :

ఈయన 1990లో గుల్బర్గా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. సిటీ క్రిమినల్‌ కోర్టులో లాయర్‌గా పనిచేశారు. ఈయన హైదరాబాద్‌ ప్రాంతనికి చెందినవారు.

5) గుగులోతు శంకర్‌ నాయక్‌:

ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ, బీఈడీ చేశారు. గిరిజన విద్యార్థి సంఘం స్టేట్‌ ఫౌండర్‌ ప్రెసిడెంట్‌గా, తెలంగాణ స్టూడెంట్‌ జేఏసీ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడిగా పని చేశారు... ఈయన మహబూబాబాద్‌ ప్రాంతనికి చెందినవారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories