Telangana SSC 2025 results: తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదలకు టైమ్ ఫిక్స్

Telangana SSC 2025 results released and here is TG 10th class results link
x

Telangana SSC 2025 results: తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదలకు సర్వం సిద్ధం

Highlights

Telangana SSC 2025 results: తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదలకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది.

Telangana 10th Class 2025 results date and time

తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాల వెల్లడించేందుకు తేదీ, సమయం ఖరారైంది. ఏప్రిల్ 30న, అంటే రేపు బుధవారం మధ్యాహ్నం 1 గంటకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 10వ తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. తాజాగా పాఠశాల విద్య శాఖ ఆ వివరాలను ప్రకటించింది.

ఎందుకు ఆలస్యమైందంటే...

గత ఏడాది వరకు పదో తరగతి ఫలితాలను సబ్జెక్టుల వారీగా మార్కులను వెల్లడించకుండా గ్రేడ్స్ కేటాయించేవారు. అన్ సబ్జెక్టులు కలిపి క్యూములేటివ్ గ్రేడ్స్ ఇచ్చేవారు. కానీ ఈ ఏడాది నుండి పదో తరగతి మార్కుల మెమోపై సబ్జెక్టుల వారీగా మార్కులు కూడా చూపించనున్నారు. మార్కుల మెమొలో ఈ మార్పుల కారణంగానే పదో తరగతి ఫలితాలు వెల్లడించడంలో కొంత ఆలస్యమైంది. ఎందుకంటే, గ్రేడ్స్‌తో పాటు మార్కులు కూడా ముద్రించే పద్ధతికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ పాఠశాల విద్యా శాఖ ఏప్రిల్ 8న ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టింది. ఆ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించడానికి 20 రోజులు పట్టింది. ఈ కారణంగానే పాఠశాల విద్యా శాఖ అధికారులు ప్రభుత్వం నుండి స్పందన కోసం ఇప్పటివరకు వేచిచూడాల్సి వచ్చింది.

గత కొన్నేళ్లుగా తెలంగాణలో 10వ తరగతి పాస్ పర్సెంటేజ్ ఎలా ఉందంటే...

2024: 91.31 %

2023- 86.6 %

2022- 90 %

2021- 100 %

2020- 100 %

2019- 92.43 %

2018- 83.78 %

ఈసారి పదో తరగతి పరీక్షలు మార్చి 21వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా విద్యార్థిని విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇక ఈసారి పాస్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది, ఎవరిది పై చేయి అవుతుందనేది తెలియాలంటే రేపు టెన్త్ క్లాస్ ఫలితాలు వెల్లడించే వరకు వెయిట్ చేయాల్సిందే. రిజల్ట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.in/ లోకి లాగాన్ అవ్వాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories