Banswada: పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి

Banswada: పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి
x
సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి
Highlights

మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న పనులను రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.

బాన్సువాడ: మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న పనులను రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అనంతరం వార్డుల్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ... మానవుడు ఆరోగ్యంగా ఉండాలంటే, నీరు - గాలి - ఆహారం ఈ మూడు, తప్పనిసరిగా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని, గత నెలలో గ్రామ పంచాయతీ పరిధిలో పల్లె ప్రగతి, ఈ నెల 24 తేది నుండి మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంను విజయవంతంగా పూర్తి చేయడం పట్టణ ప్రజలందరి బాధ్యత అన్నారు.

మురికి కాలువలో శుభ్రత, రోడ్ల పై చెత్త తొలగింపు, హరితహరంలో భాగంగా పట్టణంలో మొక్కలు నాటించాలని అధికారులకు సూచించారు. బాన్సువాడ పట్టణాన్ని బంగారు బాన్సువాడగా అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తాడ్కోల్ ప్రాంతంలో నిర్మాణం చేసిన డబుల్ బెడ్రూం ఇండ్లను, ఈ నెల సోమవారం పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. పారదర్శకంగా, పేదవారికి ఈ డబుల్ బెడ్రూంలను పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ సభలో ప్రజలకు ప్లాస్టిక్ రహితంగా, చెత్తి జనపనార సంచులను పంపిణీ చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories