అకడమిక్‌ క్యాలెండర్‌ రిలీజ్‌.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?

Telangana School Education Academic Calender 2024-25 Released
x

 అకడమిక్‌ క్యాలెండర్‌ రిలీజ్‌.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?

Highlights

తెలంగాణలో వేసవి సెలవులు అనంతరం జూన్‌ 12వ తేదీ నుంచి పాఠశాలలు తిగిరి ప్రారంభం కానున్నాయి.

తెలంగాణలో వేసవి సెలవులు అనంతరం జూన్‌ 12వ తేదీ నుంచి పాఠశాలలు తిగిరి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను విద్యా శాఖ విడుదలు చేసింది.

అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం.. రానున్న విద్యా సంవత్సరంలో పాఠశాలలు మొత్తం 229 రోజులు పనిచేయనున్నాయి. స్కూళ్లు జూన్‌ 12న ప్రారంభమై.. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 24 చివరి వర్కింగ్‌ డే. ఇక, 2025 ఏప్రిల్‌ 24 నుంచి 2025 జూన్‌ 11 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి. ఈ ఏడాది దసరాకు అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు అంటే 13 రోజులపాటు పండుగ సెలవులు ఉంటాయి. డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు. ఇక, 2025 జనవరిలో సంక్రాంతి సెలవులు జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం ఆరు రోజులు ఉంటాయని విద్యా శాఖ వెల్లడించింది.

తెలంగాణ 2024-25 విద్యాసంవత్సరం క్యాలెండర్‌ విడుదల

జూన్‌ 12న పాఠశాలలు ప్రారంభం

ఏప్రిల్‌ 23 వరకు కొనసాగనున్న పాఠశాలలు

28 ఫిబ్రవరి 2025లోపు పదో తరగతి ప్రి ఫైనల్‌ పరీక్షలు

2025 మార్చిలో పదో తరగతి పరీక్షలు

2 అక్టోబర్‌ నుంచి 14 వరకు దసరా సెలవులు

డిసెంబర్‌ 23 నుంచి 27 వరకు క్రిస్మస్‌ సెలవులు

జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు

ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు ఉన్నత పాఠశాలల సమయం

అప్పర్‌ ప్రైమరీకి ఉదయం 9 నుంచి 4.15 వరకు తరగతులు

Show Full Article
Print Article
Next Story
More Stories