డ్యూటీలకు హాజరవుతున్న ఆర్టీసీ కార్మికులు

డ్యూటీలకు హాజరవుతున్న ఆర్టీసీ కార్మికులు
x
విధులకు హాజరవుతున్న ఆర్ టి సి కార్మికులు
Highlights

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు 55 రోజుల సమ్మె తర్వాత ఆనందంగా విధుల్లోకి చేరుతున్నారు. ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా కార్మికులు విధులకు హాజరు కావొచ్చని తెలిపింది.

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు 55 రోజుల సమ్మె తర్వాత ఆనందంగా విధుల్లోకి చేరుతున్నారు. ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా కార్మికులు విధులకు హాజరు కావొచ్చని తెలిపింది. కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ కార్మికులు విధుల్లోకి చేరుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 10 డిపోల పరిధిలో 3,800 మంది కార్మికులు పనిలో చేరారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 6 డిపోల దగ్గర శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల్లోగా కండక్టర్‌లు,డ్రైవర్లు విధుల్లోకి హాజరైయ్యారు. నిజామాబాద్‌ జిల్లాలో డ్రైవర్లు,కండక్టర్లు 5 గంటల నుంచే విధులకు హాజరయ్యారు. ఖమ్మం డిపోలో ఆర్టీసీ కార్మికులు డ్యూటీకి హాజరైవుతున్నారు. 2600 మంది విధులకు హాజరుకానున్నారు. సీఎం కేసీఆర్ ఎటువంటి షరతులు తీసుకోవడంపై ధన్యవాదాలు తెలుపుతున్నారు. సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరారు. సమ్మెపై సీఎం కేసీఆర్‌ ప్రకటనతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉదయం 4 గంటలకే డిపోలకు చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 7 డిపోల పరిధిలోని 3వేల 5వందల మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories