తెలంగాణలో వాహనదారులకు మరో షాక్.. ఆ ట్యాక్స్ లు భారీగా పెంపు...

తెలంగాణలో వాహనదారులకు మరో షాక్.. ఆ ట్యాక్స్ లు భారీగా పెంపు...
TS News: ట్రావెల్స్‌పై రూ.5వేల నుంచి 12వేలు అదనం....
TS News: ఓ వైపు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తుంటే తాజాగా రవాణా శాఖ మరోసారి ట్యాక్స్‌లు పెంచుతూ ప్రజల్లో భయం పుట్టిస్తుంది. ఇటీవలే వాహనాల లైఫ్ ట్యాక్స్ పెంచిన రవాణా శాఖ మరో రెండు ట్యాక్స్‌లను పెంచి వాహనదారుల నడ్డి విరుస్తోంది. ఇంతకీ పెరిగే ఆ రెండు ట్యాక్స్‌లు ఎంటీ? గతంతో పోల్చితే ఎంత వరకు పెరిగింది? హైదరాబాద్‌లోని ట్రావెల్స్, గూడ్స్ ట్రాన్స్ పోర్టు వాహనదారులు ఏమంటున్నారు?
కరోనా కష్టకాలం తర్వాత అందరూ నెమ్మదిగా కోలుకున్నారు. వాహనదారులు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతోనే అతలాకుతలం అవుతుంటే వాహనాల గ్రీన్ ట్యాక్స్, క్వాటర్లీ ట్యాక్స్ పెంచింది రవాణా శాఖ. అధికారికంగా జీవో ఇంకా విడుదల చేయకపోయినా రవాణా శాఖ స్లాట్ బుకింగ్‌లో మాత్రం ఇప్పటికే అప్‌లోడ్ చేసింది. 15 ఏళ్లు దాటిన కమర్షియల్ బండ్లకు కండీషన్, పిట్‌నెస్ మరో ఐదేండ్లు పొడిగిస్తూ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇలా 15 ఏళ్లు దాటిన వాహనాలు దాదాపు 30 లక్షలకు పైగా ఉన్నాయి.
ఇప్పటి వరకు ఏడేళ్లు దాటిన కమర్షియల్ వెహికిల్స్‌కు 200 రూపాయలు, 15 ఏళ్లు నిండిన నాన్ ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్స్‌కు ఏటా 200 రూపాయలు, ఇలా వాహనాలను బట్టి గ్రీన్ ట్యాక్స్‌ను రెండు స్లాబుల్లో చెల్లించారు. తాజాగా రవాణా శాఖ దీన్ని మూడు స్లాబులుగా చేసింది. ఇక క్వాటర్లీ ట్యాక్స్‌లో 20 శాతం పెంచింది రవాణా శాఖ. లారీలు, ట్రావెల్స్‌పై 20 శాతం ట్యాక్స్ పెంచారు. అయితే ట్రావెల్ వాహనాలకు సీట్లను బట్టి ట్యాక్స్‌లు విధిస్తారు.
అసలు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనాలు నడిపే పరిస్ధితి లేదంటున్నారు యజమానులు. రవాణ శాఖ ట్యాక్స్‌లను పెంచడం భయాందోళన కలిగిస్తుందని వాపోతున్నారు. అసలు కిరాయిలు లేక ఇబ్బందులు పడుతుంటే మళ్లీ ట్యాక్స్‌ను పెంచడం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తున్నారు. ట్యాక్స్‌ల పెంపుపై రవాణా శాఖ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరుతున్నరు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMT
Komatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్...
12 Aug 2022 9:55 AM GMTCM Jagan: అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్.. స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక...
12 Aug 2022 9:43 AM GMTMacherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం మూవీ రివ్యూ..
12 Aug 2022 9:29 AM GMTమునుగోడు ఉపఎన్నికపై గులాబీ బాస్ ఫోకస్..
12 Aug 2022 8:38 AM GMTAirasia: స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక ఆఫర్.. రూ. 1475కే విమానంలో...
12 Aug 2022 8:05 AM GMT