Top
logo

తెలంగాణలో త్వరలో 20వేల పోలీసు ఉద్యోగాలు

తెలంగాణలో త్వరలో 20వేల పోలీసు ఉద్యోగాలు
X
Highlights

తెలంగాణ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందిన ఎస్సైల పాసింగ్ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. ఈ...

తెలంగాణ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందిన ఎస్సైల పాసింగ్ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ సారి బ్యాచ్ లో 1162మంది ఎస్సైలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో 256 మంది మహిళా ఎస్సైలు ఉండడం గమనార్హం. ఈ సందర్భంగా తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ తాజా మార్పులకు అనుగుణంగా పరిస్థితులను అర్థం చేసుకొని సమయోచితంగా, రాజ్యాంగ బద్దంగా పోలీస్ అధికారులు పనిచేయాలని మహమూద్‌ అలీ కోరారు. దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు గుర్తింపు ఉందని దానిని నిలబెట్టుకోవాలని హితవు పలికారు. తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు.

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. అందులో భాగంగానే పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నామని ఆయన స్పష్టం చేసారు. సుమారుగా 20 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. ఇప్పటి వరకు ప్రతిష్టాత్మకంగా స్థాపించిన తెలంగాణ పోలీస్ అకాడమీ ద్వారా 1,25,848 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చామన్నారు. కాగా ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో 18,428 మంది ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. నూతన సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ పోలీస్ శాఖకు అధిక బడ్జెట్‌ కేటాయిస్తున్నామన్నారు మహమూద్ అలీ. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ గౌరవం ఇవ్వాలని పోలీసులకు సూచించారు. కరోనా, భారీ వర్షాల్లోనూ పోలీసులు అందించిన సేవలను హోం మంత్రి కొనియడారు. సీఎం కేసీఆర్ విజన్ మేరకు నేరరహిత సమాజాన్ని కల్పించాలని డీజీపీ మహేందర్ రెడ్డి.

Web TitleTelangana Police Academy SI Passing Out Parade was organized in Hyderabad today
Next Story