రేపే పుర పోరు.. సర్వం సిద్ధం

రేపే పుర పోరు.. సర్వం సిద్ధం
x
Highlights

-బ్యాలెట్ ద్వారా జరగనున్న మున్సిపల్‌ పోలింగ్ -కార్పోరేషన్ 1,773 పోలింగ్ స్టేషన్లు ను ఏర్పాట్లు -ఎన్నికల విధుల్లో 55 వేల మంది సిబ్బంది

తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నిలకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. రేపు రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాల్టీలు, 9 కార్పోరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2వేల 647వార్డులకు, 382డివిజన్లలో ఎన్నికలకు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 20 వార్డులు, 3 డివిజన్లకు ఎన్నిక ఏకగ్రీవం అయ్యాయి. ఈ ఎన్నికల్లో 12వేల 898 మంది అభ్యర్ధులు పోటి పడుతున్నారు.

ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై కూడా ఉందని ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి స్సష్టం చేశారు. పోలింగ్ కు కొద్ది సమయం మాత్రమే ఉండటంతో.. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలిన విజ్జప్తి చేశారు. తమ ఓటును ఎవరైనా ముందే వేసే, ఓటరు టెండర్ ఓటు కోసం డిమాండ్ చేయ్యాలని తెలిపారు. టెండర్ ఓటు పడిన పోలింగ్ స్టేషన్లో రీ పోలింగ్ కు చేస్తామని స్పష్టం చేశారు. రానున్న ఐదేళ్ళకు తమ అవసరాల కోసం మంచి వ్యక్తిని ఎన్నుకునే బాధ్యత ఓటర్లదే తెలిపారు నాగిరెడ్డి.

పెద్దపల్లిలో డబ్బులు పంచుతోన్న అభ్యర్థిని అరెస్ట్ చేశామని.. అతనిపై ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నట్లు నాగిరెడ్డి తెలిపారు. ఇంకా గద్వాల, అలంపూర్ ప్రాంతాల్లో కూడా అభ్యర్థులు డబ్బులు పంచుతున్నట్టు ఫిర్యాదులొచ్చాయని చెప్పారు. మద్యం, డబ్బు పంపిణీని ప్రజలు తమ సెల్ ఫోన్స్ తో నిఘా పెట్టాలని.. సాక్షధారాలతో విడియో ఉంటే, అభ్యర్థి గెలిచినా అయన్ని అనర్హత కింది చేస్తామన్నారు.

అభ్యర్థులు తప్పుడు ఎన్నికల ఖర్చు చూపినా, ఆస్తులు తప్పుగా చూపినా.. ఎన్నికను రద్దు చేసే అవకాశముంటోందని చెప్పారు. రానున్న ఐదేళ్ళకు తమ అవసరాల కోసం మంచి వ్యక్తిని ఎన్నుకునే బాధ్యత ఓటర్లదే తెలిపారు నాగిరెడ్డి.

ఇప్పటికే 20 వార్డులు, 3 డివిజన్లకు ఎన్నిక ఏకగ్రీవం అయ్యాయి. మున్సిపాలిటీల్లో మొత్తం అభ్యర్థులు 11వేల 179మంది బరిలో ఉండగా, కార్పోరేషన్ మెత్తం అభ్యర్థులు 17వందల 47 పోటిలో ఉన్నాట్లు తెలిపారు. మున్సిపాలిటీల లో 40లక్షల 36వేల 346ఓటర్లు ఉండగా.. కార్పోరేషన్ 13లక్షల 13వేల 909 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నిలక నిర్వహణకు కోసం 55వేల మంది సిబ్బందిని, 15వేల మంది భద్రత సిబ్బందిని వినియోగిస్తూన్నారు. మున్సిపాలిటీల్లో 6వేల 188 పోలింగ్ స్టేషన్లు, కార్పోరేషన్ల పరిధిలో 17వందల 73 పోలింగ్ స్టేషన్లు ను ఏర్పాట్లు చేశారు.

ఈ ఎన్నికల్లో దొంగ ఓట్లను అరికట్టేందుకు కొత్త యాప్‌ను ప్రవేశ పెట్టబోతుంది. కొంపల్లి మున్సిపాలిటీలోని 10 పోలింగ్ కేంద్రాల్లో తొలిసారిగా ఫేస్ రికగ్నైజ్ యాప్‌ను వినియోగించనున్నారు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో పైలట్ ప్రాజెక్టు ఈ విధానం తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేయడం కోసం ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తుయి.

ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో రేపు లోకల్‌ హాలిడే ప్రకటిస్తూ సంబంధిత జిల్లా కలెక్టర్లు ఆదేశాలిచ్చారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా పలు శాఖల సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. సున్నిత ప్రాంతాల్లో నిఘా పెంచారు. భైంసా అల్లర్ల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories