ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్

ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
x
తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు
Highlights

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 12,926 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీపడ్డారు. ఉదయం 10 గంటలకు తొలి ఫలితం వెలువడనుంది. సాయంత్రానికల్లా వెలువడనున్న పూర్తి ఫలితాలు వస్తాయి. మొత్తం 134 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగుతోంది. ఇందుకోసం 2,559 టేబుళ్లను ఏర్పాట్లు చేశారు. ఒక్కో టేబుల్ వద్ద ఓట్ల లెక్కింపు చేయడానికి ముగ్గురు సిబ్బంది ఉంటారు. మొత్తం పదివేల మంది సిబ్బంది ఎన్నికల లెక్కింపులో పాల్గొంటున్నారు. వీరిలో 2,958 మంది సూపర్ వైజర్లు, 5,756 మంది అసిస్టెంట్లు గా వ్యవహరిస్తారు.

కౌంటింగ్ సెంటర్స్ దగ్గర సెక్యూరిటీ పెంచారు. 27న మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. పదింటికల్లా తొలి ఫలితం రానుంది. ఈ నేపథ్యంలో ఫలితాలపై రాష్ట్రం అంతా ఉత్కంఠ కనిపిస్తోంది. పార్టీలు మాత్రం తమ తమ అంచనాల మేరకు ఫలితాల వస్తాయా రావా అనే దానిపై ఆసక్తిగా మారింది.

టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన ఆధిక్యం వస్తుందని పోలింగ్‌ ‎సరళిని బట్టి స్పష్టంగా కనిపిస్తోంది. అటు 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లు అన్నింటినీ తామే కైవసం విశ్వాసం ఆపార్టీలో కనిపిస్తుంది. ప్రతిపక్షాల కూడా గట్టిపోటీ ‎ఇస్తామనే అంచనాతో ఉన్నాయి. 30 శాతం స్థానాల్లో గెలుస్తామని కాంగ్రెస్ చెబుతోంది. బీజేపీ 9 కార్పొరేషన్లు ఆశింసిన ఫలితాలలు వస్తాయని ఆశాభావంతో ఉంది.‎ వామపక్షాలు, టీజేఎస్‌ తదితర పార్టీలు కొన్ని సీట్లపై ఆశలు పెట్టుకున్నాయి.

మున్సిపోల్స్‌ పూర్తి ఫలితాలు మధ్యాహ్నానికి అధికారికంగా వచ్చే అవకాశం ఉంది , కాగా ఓటింగ్ జరిగిన రోజే పార్టీలు ఓ అంచనాకు వచ్చాయి. ఈనెల 27న జరగనున్న మున్సిపల్‌ చైర్మన్లు ఎన్నిక కార్పొరేషన్‌ మేయర్ల ఎన్నికపై కారు పార్టీ దృష్టి సారించింది. తమదే విజయమని గులాబీ నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. ‎కాంగ్రెస్ పార్టీ మాత్రం నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్ లో మంచి ఫలితాలు వస్తాయని భావిస్తోంది. ఎంఐఎం కూడా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో మంచి ఓట్లు సాధిస్తామని భావిస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories