మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు

మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు
x
TRS
Highlights

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు కొనసాగుతుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. అన్ని వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం దిశగా పనిస్తున్నారు.

తెలంగాణభవన్ కు మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. అక్కడే కౌంటింగ్ సరళిపై సమీక్ష చేయనున్నారు. ఈనెల 27న మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేషన్‌ మేయర్ల ఎన్నిక జరగనుంది.తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన ప్పటి నుంచి టీఆర్ఎస్ దుకుడు ప్రదర్శిస్తుంది. మొత్తం 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 12,926 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీపడ్డారు. ఉదయం 10 గంటలకు తొలి ఫలితం వెలువడనుంది. సాయంత్రానికల్లా వెలువడనున్న పూర్తి ఫలితాలు వస్తాయి. మొత్తం 134 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగుతోంది. ఇందుకోసం 2,559 టేబుళ్లను ఏర్పాట్లు చేశారు. ఒక్కో టేబుల్ వద్ద ఓట్ల లెక్కింపు చేయడానికి ముగ్గురు సిబ్బంది ఉంటారు. మొత్తం పదివేల మంది సిబ్బంది ఎన్నికల లెక్కింపులో పాల్గొంటున్నారు. వీరిలో 2,958 మంది సూపర్ వైజర్లు, 5,756 మంది అసిస్టెంట్లు గా వ్యవహరిస్తారు.

వర్థన్నపేట మున్సిపాలిటీని కారు పార్టీ కైవసం చేసుకుంది.

జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది.

బాన్స్ వాడ మున్సిపాల్టీ టీ ఆర్ ఎస్ కైవసం చేసుకుంది.

బొల్లారం మున్సిపోల్స్ లో 16,17, 18 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యుర్థుల విజయం

భైంసాలోని నాలుగు వార్డుల్లో ఎంఐఎం అభ్యర్థుల విజయం

నల్లగొండ, చెన్నూరు, సూర్యాపేట, పరకాల, హుజురాబాద్ లో టీఆర్ఎస్ హవా

వైరలో 7 వ వార్డులో టీ అరె ఎస్ విజయం

ఖమ్మం, మెదక్, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో టీఆర్ఎస్ ఆధిక్యం

వైరా మున్సిపాలిటీలో 7 వార్డుల్లో టీఆర్ఎస్ విజయం

డోర్నకల్ మున్సిపాలిటీలో 9, 11వ వార్డులో టీఆర్ఎస్ విజయం

మహబూబ్‌నగర్‌, హుజూర్‌నగర్‌, సూర్యాపేటలో టీఆర్‌ఎస్‌ ముందంజ

సత్తుపల్లి పదోవార్డు టీఆర్‌ఎస్‌ గెలుపు

భైంసాలో బీజేపీకి ఆధిక్యం.. మొత్తం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 14అనూహ్యంగా బీజేపీకి 8, ఎంఐఎం 3, కాంగ్రెస్‌ 1,ఇతరులకు 1 ఓటు లభించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories