Harish Rao: కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వస్తే తెలంగాణను అమ్మేస్తారు

Telangana Minister Harish Rao Hit Out Congress
x

Harish Rao: కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వస్తే తెలంగాణను అమ్మేస్తారు

Highlights

Harish Rao: పోటీ చేయడానికి కాంగ్రెస్‌కు అభ్యర్థులే లేరు

Harish Rao: కాంగ్రెస్ నేతలు తెలంగాణలో అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు మంత్రి హరీష్‌రావు. నిజామాబాద్ జిల్లా బిచ్కుందలో వంద పడకల ఆస్పత్రి శంకుస్థాపన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో టికెట్ల కోసం ఫీజులు పెట్టిన వాళ్లు.. ఇప్పుడు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ ప్రస్తుతం వయా బెంగళూరుకు మారిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేదన్నారు. అసలు పోటీ చేయడం కోసం అభ్యర్థులే లేరని విమర్శించారు. అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ ఫేక్ సర్వేలు చేస్తున్నారని మంత్రి హరీష్‌రావు విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories