Maoists Surrender: 40 ఏళ్ల మావోయిస్ట్ ఉద్యమానికి ముగింపు దిశగా కీలక పరిణామాలు

Maoist
x

Maoist: 40 ఏళ్ల మావోయిస్ట్ ఉద్యమానికి ముగింపు దిశగా కీలక పరిణామాలు

Highlights

Maoist: తెలంగాణలో నలుగురు కీలక మావోయిస్ట్ అగ్రనేతలు లొంగుబాటు. మావోయిస్టులపై చర్యల్లో రాష్ట్ర ప్రత్యేక గూఢచారి విభాగం గణాంకాలు వెల్లడించిన పోలీసులు.

తెలంగాణను మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ప్రకటించే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ శివధర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

శ్రీకాకుళంలో ప్రారంభమైన 40 ఏళ్ల మావోయిస్ట్ ఉద్యమ చరిత్ర నేడు ఐసీసీసీ వేదికగా ముగింపుకు చేరుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో నలుగురు కీలక మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోనున్నట్లు సమాచారం.

దేవుజి అలియాస్ తిప్పిరీ తిరుపతి, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నున్నే నరసింహ రెడ్డి లొంగుబాటుకు సిద్ధమైన నేతలుగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఉన్న దేవుజి అలియాస్ తిప్పిరీ తిరుపతి లొంగిపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా గణపతి నేపాల్‌లో తలదాచుకున్నట్లు సమాచారం.

మావోయిస్టులపై చర్యల్లో రాష్ట్ర ప్రత్యేక గూఢచారి విభాగం కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు వెల్లడించారు. విభాగం ఏర్పాటు తర్వాత అనేక ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు. సమాచారం సేకరణ, వనరుల బలోపేతంలో ప్రత్యేక గూఢచారి విభాగం పాత్ర ముఖ్యమైందని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు 14,078 మంది మావోయిస్టు క్యాడర్లను అరెస్ట్ చేసినట్లు, 5,865 మంది లొంగుబాటు చేసుకున్నట్లు వెల్లడించారు. 1,289 మంది ఎన్‌కౌంటర్లలో మృతి చెందినట్లు, మొత్తం 1,057 ఎన్‌కౌంటర్ ఘటనలు నమోదు అయినట్లు వివరించారు.

కేంద్ర కమిటీకి చెందిన 23 మంది సభ్యులపై సమాచారం సేకరణలో కీలక పాత్ర పోషించినట్లు అధికారులు తెలిపారు. వారిలో 7 మంది అరెస్ట్ కాగా, 7 మంది లొంగుబాటు చేసుకున్నారని, 9 మంది ఎన్‌కౌంటర్లలో మృతి చెందినట్లు పేర్కొన్నారు.

మొత్తం 21,232 మంది మావోయిస్టులపై చర్యల్లో రాష్ట్ర ప్రత్యేక గూఢచారి విభాగం కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories