విద్యార్థులకు వాట్సాప్ సేవలు… ఇకపై మీసేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు!

విద్యార్థులకు వాట్సాప్ సేవలు… ఇకపై మీసేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు!
x

విద్యార్థులకు వాట్సాప్ సేవలు… ఇకపై మీసేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు!

Highlights

తెలంగాణ డిజిటల్ పాలనలో మరో కీలక అడుగు పడింది. ఇకపై అత్యవసర విద్యా పత్రాల కోసం విద్యార్థులు మీసేవా కేంద్రాల వద్ద క్యూల్లో నిలబడాల్సిన సమస్య ఉండదు.

తెలంగాణ డిజిటల్ పాలనలో మరో కీలక అడుగు పడింది. ఇకపై అత్యవసర విద్యా పత్రాల కోసం విద్యార్థులు మీసేవా కేంద్రాల వద్ద క్యూల్లో నిలబడాల్సిన సమస్య ఉండదు. వాట్సాప్ ఓపెన్ చేస్తే చాలు… అవసరమైన డాక్యుమెంట్లు మీ ఫోన్‌లోనే వెంటనే అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త సేవలను రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు అధికారికంగా ప్రారంభించారు. విద్యార్థులకు వేగవంతమైన, సులభమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.

ఒక్క మెసేజ్‌తో హాల్‌టికెట్లు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఇప్పటి నుంచి 8096958096 అనే వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ పంపి 24 గంటలు, వారంలో ఏడు రోజులూ హాల్ టికెట్లు పొందవచ్చు. SSC, ఇంటర్, డిగ్రీ, పీజీ, పోటీ పరీక్షలు — ఎలాంటి పరీక్ష అయినా హాల్ టికెట్ ఒక మెసేజ్ దూరంలోనే లభ్యం. మీసేవ, మెటా కలిసి రూపొందించిన ఈ సౌకర్యం ద్వారా మొత్తం 38 శాఖలకు చెందిన 580కి పైగా సేవలు వాట్సాప్‌లో అందుబాటులోకి రానుండటం విశేషం.

త్వరలో మరిన్ని కొత్త సేవలు

వాట్సాప్ ఆధారిత మీసేవా ప్లాట్‌ఫారమ్‌ను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలో ఈ సేవలను తెలుగు, ఉర్దూ భాషల్లో కూడా అందించనున్నారు. అదనంగా వాయిస్ కమాండ్ ఫీచర్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. దీని ద్వారా ఫోన్‌ను తాకకుండా కూడా అవసరమైన సేవలను పొందే అవకాశం ఉంటుంది. త్వరలో మరిన్ని శాఖలను ఈ ప్లాట్‌ఫారమ్‌కు అనుసంధానం చేసి సేవలను మరింత విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories