Telangana Inter Exams 2026: రూ.500 చెల్లించి హాజరు మినహాయింపు పొందండి – విద్యార్థులకు బోర్డు శుభవార్త

Telangana Inter Exams 2026: రూ.500 చెల్లించి హాజరు మినహాయింపు పొందండి – విద్యార్థులకు బోర్డు శుభవార్త
x

Telangana Inter Exams 2026: రూ.500 చెల్లించి హాజరు మినహాయింపు పొందండి – విద్యార్థులకు బోర్డు శుభవార్త

Highlights

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రైవేట్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌ వంటి కోర్సుల్లో చదివే విద్యార్థులు ఇకపై కాలేజీకి హాజరు కాకుండానే ఫైనల్ పరీక్షలు రాయొచ్చు. ఇందుకోసం బోర్డు నిర్ణయించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఫీజు చెల్లింపు గడువు:

హాజరు మినహాయింపు కోరుకునే విద్యార్థులు రూ.500 చెల్లించాలి. ఈ ఫీజు 2025 నవంబర్ 17 లోపు చెల్లించాలి. గడువు మిస్ అయితే 2025 నవంబర్ 29 వరకు రూ.200 ఆలస్య రుసుముతో చెల్లించవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ:

విద్యార్థులు tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ఎస్ఎస్‌సీ ఒరిజినల్ సర్టిఫికేట్, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC), ఇతర అవసరమైన పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించాలి. పోస్టు ద్వారా పంపిన దరఖాస్తులు రద్దు చేయబడతాయి.

నిబంధనలు & అర్హతలు:

పదో తరగతి లేదా సమాన అర్హతతో ఏడాది గ్యాప్ ఉన్న విద్యార్థులు ఫస్ట్ ఇయర్ ఇంటర్ పరీక్షలు 2026కు హాజరుకావచ్చు.

రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల గ్యాప్ ఉన్నవారు ఫస్ట్, సెకండ్ ఇయర్ ఐపీఈ 2026 పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంది.

ఫస్ట్, సెకండ్ ఇయర్ పాస్ అయిన విద్యార్థులు సెకండ్ లాంగ్వేజ్ లేదా అదనపు సబ్జెక్ట్ పరీక్షలు రాయవచ్చు.

బైపీసీ గ్రూప్ పాస్ అయిన విద్యార్థులు మ్యాథమెటిక్స్ను అదనపు సబ్జెక్ట్‌గా ఎంచుకోవచ్చు.

తెలంగాణకు బయటి రాష్ట్రాల్లో ఎస్ఎస్‌సీ లేదా సమాన పరీక్ష రాసినవారు, తెలంగాణ బోర్డు నుండి అర్హత సర్టిఫికేట్ పొందాలి. దానిని స్కాన్ కాపీగా అప్‌లోడ్ చేయాలి.

గమనిక:

అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులు, ఒరిజినల్ సర్టిఫికేట్లు లేని లేదా తప్పు పత్రాలు జత చేసిన అప్లికేషన్లు బోర్డు రద్దు చేస్తుంది.

సిలబస్ వివరాలు:

ప్రైవేట్ విద్యార్థులు రెగ్యులర్ విద్యార్థులకే బోధించిన సిలబస్ ఆధారంగా పరీక్షలు రాయాల్సి ఉంటుంది.

పరీక్ష తేదీలు:

ఫైనల్ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 2026లో నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories