Top
logo

Telangana High Court: తెలంగాణ కోవిడ్ నిర్వహణ పై హైకోర్టులో విచారణ వాయిదా..

Telangana High Court: తెలంగాణ కోవిడ్ నిర్వహణ పై హైకోర్టులో విచారణ వాయిదా..
X
Highlights

Telangana High Court: కోవిడ్ సెంటర్ల నిర్వహణపై హైకోర్ట్ లో విచారణ జరిగింది.

Telangana High Court: కోవిడ్ సెంటర్ల నిర్వహణపై హైకోర్ట్ లో విచారణ జరిగింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్న ఎందుకు పట్టించుకోవటంలేదు అని పప్రశ్నించిన హైకోర్ట్. దానిపై ఈ నెల 22న రిపోర్టు ఇవ్వాలి అని.. డిజాస్టార్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ఎవిధంగా ఉన్నాయో, ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని, పబ్లిక్ హెల్త్ పై మార్చి 24 కు ముందు ఎంత ఖర్చు చేశారు. ఆ తర్వాత ఎంత ఖర్చు పెట్టారో నివేదిక ఇవ్వాలి ఆదేశించింది.

ప్రయివేట్ అస్పటల్స్ కి నోటీసులు ఇచ్చామన్నారు. ఎంత మందికి ఇచ్చారు? ప్రభుత్వం తీసుకున్న చర్యల పై నివేదిక సమర్పించాలి.. ప్రయివేట్ అస్పత్రి పై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? 50శాతం బెడ్స్ పై ఢిల్లీ ప్రభుత్వం లాగా వ్యవహారించాలి. తెలంగాణలో ఎలా చేశారో నివేదిక ఇవ్వండి. ప్రతి రోజు కరోనా వల్ల రాష్ట్రంలో 8 నుండి 10 మందే చనిపోతున్నారా అని ప్రశ్నించింది. తక్కువ టెస్ట్ లు చేసి తప్పుడు రిపోర్ట్ లు ఇస్తే సీఎస్ ను కోర్ట్ కు పిలుస్తామని ధర్మాసనం తెలిపింది.

కోవిడ్ హాస్పటల్స్ పై చర్యలు తీసుకోవడంలో వ్యతసం ఉందన్న పిటిషనర్ తరుపున్యాయవాధి. హాస్పటల్స్ లో స్టాఫ్ ని, మౌళిక సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి స్టాఫ్ ని పెంచారో నివేదిక ఇవ్వాలన్న ధర్మాసనం. తదుపరి విచారణ ఈనెల 24 కి వాయిదా వేసింది.

Web TitleTelangana High Court Serious on Telangana Government and Postpone hearing to 24th September
Next Story