దురాక్రమణలను పట్టించుకోరా?.. తెలంగాణా ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

దురాక్రమణలను పట్టించుకోరా?.. తెలంగాణా ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
x
Telangana High Court (File Photo)
Highlights

HC on Telangana Govt: చెరువులు ఆక్రమణలకు గురవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ హైకోర్టు తెలంగాణా ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించింది.

HC on Telangana Govt: చెరువులు ఆక్రమణలకు గురవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ హైకోర్టు తెలంగాణా ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించింది. వీటి పరిరక్షణకు ఎందుకు చర్యలు తీసుకోలేదో వివరించాలని, అదేవిధంగా గరిష్ట నీటి మట్టానికి సంబంధించిన అన్ని మ్యాపులు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని చెరువులన్నీ దురాక్రమణకు గురవుతున్నాయని, ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు చేపట్టకపోతే తెలంగాణ కూడా రాజస్తాన్‌ ఎడారిలా మారుతుందని హైకోర్టు హెచ్చరిం చింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని చెరువులు దు రాక్రమణకు గురవుతున్నా కలెక్టర్‌ తగిన చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. గతంలో ఆదేశించినా.. చెరువుల పరిరక్షణకు కమిటీలను ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీసింది. చెరువుల గరిష్ట నీటిమట్టానికి సంబం ధించిన అన్ని మ్యాపులను సమర్పించాలని ప్ర భుత్వాన్ని ఆదేశించింది.

రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఖాజాగూడ చెరువు దురాక్రమణకు గురవుతోందంటూ సోషలిస్ట్‌ పార్టీ (ఇం డియా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ లుబ్నా సావత్‌ రాసిన లేఖ ను హైకోర్టు సుమోటో ప్రజాహి త వ్యాజ్యంగా స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం దీన్ని విచారించింది. ఖాజాగూడ చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే తగిన చర్యలు తీసుకోవాలని గతంలో కలెక్టర్‌ను ఆదేశించినా ఎందుకు చర్యలు చేపట్టలేదని ధర్మాసనం అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ను ప్రశ్నిం చింది. ఆ అధికారి బదిలీ అయ్యారని, ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను సమర్పించేందుకు కొంత గడువు కావాలని కోరారు.

అధికారులు

మేల్కొనడం లేదు..

'హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని చెరువులన్నీ దురాక్రమణకు గురవుతన్నాయి. అయినా అధికారులు మేల్కొనడం లేదు. ఇప్పటికైనా జంట నగరాల్లో, రంగారెడ్డి జిల్లాలో చెరువుల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోకపోతే రాజస్తాన్‌లోని ఎడారిలా తెలంగాణ మారే ప్రమాదం ఉంది' అని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. చెరువుల పరిరక్షణకు ఏం చర్యలు చేపట్టబోతున్నారు? కమిటీలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారు ? తదితర పూర్తి వివరాలను సమర్పించాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్‌ 8కి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories