139 కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన హై కోర్టు

139 కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన హై కోర్టు
x
Highlights

తెలంగాణ హై కోర్టు రాష్ట్రంలోని పలు కాలేజీలకు షాక్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీలలో 139 కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కళాశాలల్లో...

తెలంగాణ హై కోర్టు రాష్ట్రంలోని పలు కాలేజీలకు షాక్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీలలో 139 కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కళాశాలల్లో పనిచేస్తున్న స్టాఫ్ కు కాలేజీ యాజమాన్యాలు జీతాలు చెల్లించడం లేదంటూ బాలకృష్ణా రెడ్డి అనే వ్యక్తి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. లాక్ డౌన్ సమయంలో ఎంప్లాయిస్ కు జీతాలు చెల్లించ లేదని ఈ సమయంలో తమకు ఎంతో కష్టం అయిందని కోర్టుకు పిటీషనర్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న కళాశాలలు ఆర్టికల్ 226 హక్కులను కాలరాస్తున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న కళాశాలలు తెలంగాణ ఎడ్యుకేషనల్ ఆక్ట్ 1982, అదే విధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 21, 23 కింద పొందుపరచబడిన హక్కులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఇక ఈ పిటిషన్ పై హై కోర్టు విచారణ చేపట్టింది. కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరిని కళాశాల యాజమాన్యాలు జీతాలు చెల్లించాలని వేతనాలు ఇవ్వని కాలేజీలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే కాలేజీలు, అలాగే స్కూళ్లు బంద్ అయిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని పలు కాలేజీల యాజమాన్యాలు, పాఠశాల యాజమాన్యాలు పిల్లలకు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. అయితే కొన్ని కొంత మంది సిబ్బంధికి వేతనాలు ఇచ్చినప్పటికీ కొన్ని యాజమాన్యాలు మాత్రం సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదని ఆరోపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories