తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
x
Highlights

తెలంగాణ నూతన సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాల కోసం పాతకట్టడాల కూల్చివేతపై హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లను ధర్మాసనం విచారణ చేపట్టింది. కొత్త అసెంబ్లీ...

తెలంగాణ నూతన సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాల కోసం పాతకట్టడాల కూల్చివేతపై హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లను ధర్మాసనం విచారణ చేపట్టింది. కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసం ఎర్రమంజిల్‌లో ఉన్న హెరిటేజ్‌ భవనం కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌పై అడ్వకేట్‌ రచనారెడ్డి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ధర్మాసనం అసెంబ్లీ కొత్త డిజైన్ ‌ప్లాన్‌తో కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రాఫిక్‌కు ఇబ్బందిగా ఉన్న ప్రాంతంలో అది కూడా హెరిటేజ్ భవనం కూల్చి ఎందుకు కట్టలనుకుంటున్నారని ప్రశ్నించింది. ఈ సందర్భంగా గూగుల్‌ మ్యాప్‌ ద్వారా ఎర్రమంజిల్‌ ఛాయచిత్రాన్ని హైకోర్టు పరిశీలించింది. ఈ సందర్భంగా ఉన్న నిర్మాణాలను వదిలేసి కొత్తవి కట్టాల్సిన అవసరమేముందన్న హైకోర్టు హెరిటేజ్‌ భవనాలను కూల్చాల్సిన కారణాలు చెప్పాలని ఆదేశించింది. అసెంబ్లీ, సెక్రెటేరియట్ నిర్మాణాలపై ప్రభుత్వం దగ్గరున్న ప్లాన్స్ నూతన భవనాల నిర్మాణ అవసరాలపై వివరాలు అందించాలన్న కోర్టు తదుపరి విచారణను.. జులై 8 కి వాయిదా వేసింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories