పదో తరగతి పరీక్షలపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా..

పదో తరగతి పరీక్షలపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా..
x
Highlights

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో హై కోర్టు ఆదేశానుసారం పదో తరగతి పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో హై కోర్టు ఆదేశానుసారం పదో తరగతి పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో తిరిగి పరీక్షలు నిర్వహించేందుందు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును విన్నవించింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు పదో తరగతి పరీక్షలు నిర్వహించవచ్చని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం జూన్ 8 వ తేది నుంచి పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లను పూర్తి చేస్తుంది.

ఈ నేపథ్యంలోనే మరో సారి పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాల వారీగా పదో తరగతి పరీక్షల నివేదికను హైకోర్టుకు నివేదించారు. ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించడంతో జిల్లాల వారీగా పదో తరగతి పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని అడ్వాకేట్‌ జనరల్‌ పేర్కొన్నారు. కరోనా కేసుల నేపథ్యంలో అన్ని సెంటర్లలో జాగ్రతలు తీసుకుంటున్నామని ప్రభుత్వం పేర్కొంది. ఇకపోతే ప్రస్తుతం తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

ఇప్పటికే రెండు పరీక్షలు జరిగి మరో 8 పేపర్లు నిలిచిపోయాయి. వాటిలో ఇంగ్లిష్‌, గణితం, సామాన్యశాస్త్రం, సాంఘికశాస్త్రం పరీక్షలు 2 పేపర్ల చొప్పున 8 ఉంటాయి. ఇక ఈ ఎనిమిది పరీక్షలు నిర్వహించడానికి ప్రతి పరీక్షకు 2 రోజుల విరామం ఇవ్వాలని భావిస్తున్నారు. వాటిలో మధ్యలో ఆదివారాలు రావడంతో ప్రతి3 పరీక్షలకు 3 రోజులు విరామం వస్తుంది. మిగిలిన 5 పరీక్షలకు 2 రోజులు విరామం ఉంటుంది. కేవలం రెండు రోజులు మాత్రమే విరామం ఇస్తూ ఆదివారం కూడా పరీక్షలు నిర్వహిస్తే 8 ప్రధాన పరీక్షలు జూన్‌ 8 నుంచి 29 వరకు పూర్తవుతాయని అధికారులు అభిప్రాయపడ్డారు. హైకోర్టు తీర్పుమేరకు ప్రతిపాదిత టైంటేబుల్‌ను ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపుతున్నామని ఎస్‌ఎస్‌సీ బోర్డు డైరెక్టర్‌ ఏ సత్యనారాయణరెడ్డి తెలిపారు.

పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు...

♦ పరీక్షాకేంద్రాలను 4,535కు పెంచారు.

♦ అదనంగా ఏర్పాటుచేసిన 2,005 పరీక్ష కేంద్రాల్లో వైద్య సిబ్బందిని నియమించారు.

♦ ప్రతి పరీక్ష కేంద్రంలో 100 నుంచి 120 విద్యార్థులే ఉంటారు.

♦ 10 నుంచి 12 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమించారు.

♦ బెంచికి ఒక విద్యార్థి మాత్రమే కూర్చొంటారు. అది కూడా జిగ్‌జాగ్‌ పద్ధతిలో కూర్చోబెడతారు.

♦ ప్రతి విద్యార్థికి మధ్య ఐదారడుగుల భౌతికదూరాన్ని పాటిస్తారు.

♦ కొత్తగా ఏర్పాటైన కేంద్రాలు విద్యార్థులకు చూపించడంకోసం అదనంగా 26,422 మంది సిబ్బందిని అందుబాటులోకి తీసుకొచ్చారు.

♦ విద్యార్థితోపాటు ఒకరికే పరీక్షాకేంద్రానికి వెళ్లేందుకు అనుమతిస్తారు.

♦ విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తీసుకొచ్చే బస్సుల్లోనూ కరోనా నిబంధనలు పాటిస్తారు.

♦ పరీక్షకు హాజరయ్యే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలి.

♦ ప్రతి విద్యార్థికి థర్మల్‌స్క్రీనింగ్‌ చేస్తారు. జ్వరం, జలుబు ఉంటే ప్రత్యేక పరీక్ష గది ఏర్పాటుచేస్తారు.

ప్రతిపాదిత టైంటేబుల్‌....

♦ జూన్‌ 8 ఇంగ్లిష్‌ పేపర్‌ -1

♦జూన్‌ 11 ఇంగ్లిష్‌ పేపర్‌ -2

♦ జూన్‌ 14 గణితం పేపర్‌-1

♦ జూన్‌ 17 గణితం పేపర్‌-2

♦ జూన్‌ 20 సామాన్యశాస్త్రం -1

♦ జూన్‌ 23 సామాన్యశాస్త్రం-2

♦ జూన్‌ 26 సాంఘికశాస్త్రం -1

♦ జూన్‌ 29 సాంఘిక శాస్త్రం-2

♦ జూలై 2 ఓఎస్‌ఎస్‌సీ పేపర్‌ -1

♦ జూలై 5 ఓఎస్‌ఎస్‌సీ పేపర్‌-2

♦ జూలై 8 ఎస్సెసీ ఒకేషనల్‌ థియరీ

Show Full Article
Print Article
More On
Next Story
More Stories