Telangana: తెలంగాణ లో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ

TS High Court Hearing on Covid Cases
x

తెలంగాణ:(ఫైల్ ఇమేజ్)

Highlights

Telangana: తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసుల నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

Telangana: తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఎందుకు తక్కువగా చేస్తున్నారని ఫైర్ అయ్యింది. కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై ప్రభుత్వం సమర్పించిన నివేదికపై అసహనం వ్యక్తం చేసింది. థియేటర్లు, బార్లు, పబ్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో తెలపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణలో కరోనా పరీక్షలు చేపడుతున్న విధానాన్ని కూడా హైకోర్టు తప్పుబట్టింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు అతి తక్కువగా చేస్తున్నారని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ర్యాపిడ్ టెస్టులపైనే దృష్టి పెట్టిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు 10 శాతం కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే పరీక్షల సంఖ్యను నెమ్మదిగా పెంచుతున్నామని అడ్వొకేట్ జనరల్ చెప్పడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

తెలంగాణలో కరోనా కేసులు వేగంగా విస్తరిస్తుంటే.. పరీక్షలను నెమ్మదిగా పెంచడమేంటని ప్రశ్నించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలను వేగంగా పెంచాలని స్పష్టం చేసింది. పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో జనం గుమిగూడకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాల రేటు స్పష్టంగా వెల్లడించాలని హైకోర్టు పేర్కొంది. రాష్ట్రంలోని అనాథ, వృద్ధాశ్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. కరోనా నిబంధనలు అమలుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలన్న హైకోర్టు... కరోనా నిబంధనలు పాటించని వారి వివరాలు తెలపాలని పేర్కొంది. రెండు రోజుల్లో దీనిపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, నిర్మాణ ప్రాంతాల్లో పరీక్షల వివరాలు తెలపాలని సూచించింది. కరోనా చికిత్స కేంద్రాల వివరాలపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories