ఆర్టీసీ సమ్మెపై న్యాయమూర్తులతో కమిటీ

ఆర్టీసీ సమ్మెపై న్యాయమూర్తులతో కమిటీ
x
Highlights

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని పేర్కొంది.

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని పేర్కొంది. ఈ విషయమై ప్రభుత్వం అభిప్రాయం బుధవారంలోగా చెప్పాలని అడ్వకేట్‌ జనరల్‌ను ఆదేశించింది. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి. సమ్మె చట్టవిరుద్ధం అని ఆదేశించే అధికారం న్యాయ స్థానానికి లేదంటూ మరోసారి తేల్చి చెప్పింది హైకోర్టు. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేసింది.

ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో మరోసారి వాదనలు జరిగాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం తరపున సీనియర్ కౌన్సిల్ విద్యాసాగర్‌ వాదనలు విన్పించారు. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్దమా కాదా అనే అంశంపై వాదనలు కొనసాగాయి. అయితే ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్దమని ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సమ్మె చట్ట విరుద్ధం అని ఆదేశించడానికి కోర్టుకు ఉన్న పరిధి, అధికారాల గురించి సీనియర్‌ న్యాయవాది విద్యాసాగర్‌ తన వాదనలు విన్పించారు. గతంలో ఏపీఆర్టీసీ ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించారు.... కాబట్టి ఇప్పుడు టీఎస్‌‌ఆర్టీసీ ఉద్యోగులపై కూడా ఎస్మా ప్రయోగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆర్టీసీని 1998, 2015 సంవత్సరంలో ఎస్మా కింద పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు విద్యాసాగర్‌

APSRTC మీద ఉన్న ఎస్మా TSRTC కి ఎలా వర్తిస్తుందని ప్రభుత్వ తరుపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. గతంలో ఇచ్చిన జీవోలు ఇప్పుడు వర్తిస్తాయా?.. అని హైకోర్టు ప్రశ్నించింది.. ఎస్మా కింద సమ్మె చట్ట విరుద్ధంగా ప్రకటించవచ్చని ప్రభుత్వ తరపు న్యాయవాది విద్యాసాగర్ వాదించారు .. మీరు చెపుతున్నట్లు 1998 ఇచ్చింది ఎపీఎస్సార్టీసీ వర్తిస్తుందని.. ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీకి కాదని, ఇక 2015 లో ఇచ్చిన ఉత్తర్వుల్లో కేవలం ఆరునెలలకి మాత్రమే వర్తిస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది.బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మరో పిటిషనర్ తరఫు న్యాయవాది శశి కిరణ్ వాదనలు వినిపించగా, అధిక చార్జీలు వసూలు చేస్తే... వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేయవచ్చని... ఆ కారణంగా సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించలేమన్న తేల్చి చెప్పింది.

మరోసారి చెపుతున్నాం. చట్టానికి అతీతంగా నిర్ణయాలు తీసుకోలేం, సమ్మె లీగలా..ఇల్లిగలా .. అన్నది నిర్ణయించడం మా పరిధిలో లేదు..ఆర్టీసీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరపాలని ఏ చట్టంలో ఉందని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. మీరు చెపుతున్నట్లు చర్చలు జరపాలని ఏ ప్రాతిపదికన హైకోర్టు ఆదేశించగలదని,, హైకోర్టు కూడా చట్టానికి అతీతం ఏమి కాదని, చట్టాల పరిధి దాటి వ్యవహరించ లేమని గుర్తుచేసింది న్యాయ స్థానం.

ఆర్టీసీ సమ్మెపై ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ జడ్జీలతో కమిటీ వేస్తామన్న హైకోర్టు వ్యాఖ్యలను తాము అంగీకరిస్తున్నామన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తే తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్నారు. యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి కార్మికులతో చర్చలు జరపాలని కోరుతున్నామన్నారు.

రేపటి తీర్పు ఎలా ఉండబోతుందనే దానిపై అటు యాజమాన్యం.. ఇటు ఆర్టీసీ కార్మికుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories