వైఎస్‌ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

Telangana High Court  Allowed YSRTP Chief YS Sharmila Padayatra
x

వైఎస్‌ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

Highlights

*షరతులతోకూడిన అనుమతి మంజూరు.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దని సూచన

Telangana High Court: వైఎస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రను రేపటినుంచి మొదలు పెట్టనున్నారు. తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో మళ్లీ జనంలోకి వెళ్లనున్నారు. వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర వరంగల్ జిల్లాలో ఉద్రిక్తత దారి తీయడంతో.. పోలీసులు అనుమతి రద్దు చేశారు. పాదయాత్ర చేసేందుకు ప్రయత్నించిన ఆమెను అడ్డుకున్న పోలీసులు.. హైదరాబాద్ తరలించారు. షర్మిల పాదయాత్రకు నర్సంపేట పోలీసులు అనుమతి రద్దు చేశారని.. తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. షర్మిల పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దని, విమర్శనాత్మకంగా మాట్లాడవద్దని హైకోర్టు సూచించింది. దీంతో రేపటినుంచి యధావిధిగా పాదయాత్రను కొనసాగించాలిని షర్మిల నిర్ణయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories