ప్రమాదం పొంచి ఉంది..అప్రమత్తత అవసరం..ఆరోగ్యశాఖా మంత్రి ఈటెల రాజేందర్

ప్రమాదం పొంచి ఉంది..అప్రమత్తత అవసరం..ఆరోగ్యశాఖా మంత్రి ఈటెల రాజేందర్
x
Highlights

తెలంగాణా ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కరోనా ముప్పు పూర్తిగా తొలిగిపోలేదు. ఇటీవల దసరా.. బతుకమ్మ పండుగల నేపధ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చారు. ఒక్క దగ్గర చేరి పండగలు నిర్వహించుకున్నారు. ఈ నేపధ్యంలో కేసుల సంఖ్యా పెరిగే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. అదీ కాకుండా శీతాకాలం మొదలవడంతో కరోనా వైరస్ తీవ్రత పెరిగే అవకాశం ఉందనీ భావిస్తోంది. ఈ క్రమంలో ఈరోజు ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష జరిపారు.

కరోనా మళ్ళీ వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రజలను మాస్కుల వినియోగం, సానిటైజర్ వినియోగం పై మరింతగా అప్రమ్మత్తం చేయాలనీ మంత్రి ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులకు సూచించారు. ప్రస్తుతం అదుపులోనే కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ అలసత్వం పనికిరాదనీ..అప్రమత్తంగా ఉండాలనీ చెప్పారు. అదేవిధంగా మెరికా, యూరప్ దేశాలలో కేసులు పెరుగుదల.. దేశంలోనూ ఢిల్లీ, కేరళలో కేసులు పెరుగుతున్న తీరుపై సమావేశంలో చర్చించారు.

ఇక వ్యాక్సిన్​పై విస్తృత ప్రయోగాలు జరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ప్రజలందరీ అందేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు , ఆక్సిజన్ సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ... పట్టణాల్లో మున్సిపల్ శాఖ అధికారులతో, గ్రామాలలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories