తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు LIVE: సర్పంచ్ ఎన్నికల లైవ్ అప్డేట్స్

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు LIVE: సర్పంచ్ ఎన్నికల లైవ్ అప్డేట్స్
x

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు LIVE: సర్పంచ్ ఎన్నికల లైవ్ అప్డేట్స్

Highlights

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ప్రారంభమైంది. పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలు పెద్దఎత్తున తమ పల్లెలకు చేరుకుని ఓటుహక్కు వినియోగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల తాజా అప్డేట్స్ ఇవి:

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ప్రారంభమైంది. పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలు పెద్దఎత్తున తమ పల్లెలకు చేరుకుని ఓటుహక్కు వినియోగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల తాజా అప్డేట్స్ ఇవి:

కామారెడ్డి

రామారెడ్డి మండలం చిన్న గోకుల్ తండా వాసులు ఎన్నికలను బహిష్కారం.

పెద్ద గోకుల్ తండా వాసులు తమకు సమాచారం లేకుండా సర్పంచ్‌ను ఏకగ్రీవం చేశారని ఆగ్రహం.

వేలంపాట ద్వారా ఏకగ్రీవం చేశారని చిన్న గోకుల్ తండా ఆరోపణ.

ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్.

సిద్దిపేట (ఉదయం 7–9 గంటలు) – పోలింగ్ శాతం 24.38%

దౌల్తాబాద్ – 22.1%

గజ్వేల్ – 21.05%

జగదేవ్‌పూర్ – 21.26%

మార్కుక్ – 29.30%

ములుగు – 26.87%

రాయపోల్ – 26.37%

వర్గల్ – 26.18%

ఇతర జిల్లాల పోలింగ్ శాతం

వికారాబాద్ – 23.76%

ఆసిఫాబాద్ – 19.10%

నల్లగొండ – 21.90%

సూర్యాపేట – 27.36%

యాదాద్రి – 20.23%

జోగులాంబ గద్వాల – 22.26%

నారాయణపేట – 21.13%

ఆదిలాబాద్ – 10.67%

నిర్మల్ – 16.57%

నిజామాబాద్ – 19.80%

మెదక్ – 20.52%

మంచిర్యాల – 17%

సంగారెడ్డి – 23.46%

సిద్దిపేట జిల్లా తాజా అప్డేట్

కలెక్టర్ హైమవతి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.

ఉదయంలొ చలికాలం ప్రభావంతో పోలింగ్ మందకొడిగా ప్రారంభం.

మధ్యాహ్నం 12 నుండి 1 గంటల వరకు పోలింగ్ వేగం పెరిగే అవకాశం.

మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం.

జిల్లాలో 33 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, ఐదు కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్.

పోలింగ్ కేంద్రాల్లో ఘటనలు

మహబూబాబాద్: అమనగల్ పోలింగ్ కేంద్రంలో అభ్యర్థులు ఓటర్ల కాళ్లు మొక్కి ఓట్లు అడిగిన ఘటన.

వరంగల్: వృద్ధులు, వికలాంగులను తీసుకువచ్చిన కుటుంబ సభ్యులను గేట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు.

యాదాద్రి: రుస్తాపురం పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు పెద్దఎత్తున ఓటుహక్కు వినియోగించారు.

డబ్బుల సీజ్

సిద్దిపేట గజ్వేల్ మండలం అక్కారం బస్టాప్ వద్ద 2.25 లక్షల నగదు సీజ్.

జగదేవ్‌పూర్ సర్పంచ్ అభ్యర్థి డబ్బులుగా అనుమానం.

పలు జిల్లాల్లో పోలింగ్ ఏర్పాటు & అభ్యర్థులు

రాష్ట్రవ్యాప్తంగా వేలాది అభ్యర్థులు బరిలో.

లక్షల సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

పోలీసు బందోబస్తు భారీగా ఏర్పాటు.

మొత్తం రాష్ట్ర పరిస్థితి

తొలి విడతలో 3,834 పంచాయతీలకు, 27,628 వార్డులకు ఎన్నికలు.

12,960 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో.

56,19,430 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

భద్రత కోసం 50 వేల మంది పోలీసులు మోహరింపు.

పోలింగ్: ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు.

కౌంటింగ్: మధ్యాహ్నం 2 గంటల నుంచి.

సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories