డ్రగ్స్‌పై కఠినంగా వ్యవహరించనున్న తెలంగాణ సర్కార్.. ఎంతటి వారినైనా...

Telangana Govt Serious Actions on Drug Rockets | Telangana Live News
x

డ్రగ్స్‌పై కఠినంగా వ్యవహరించనున్న తెలంగాణ సర్కార్.. ఎంతటి వారినైనా...

Highlights

Telangana Drug Rockets: త్వరలోనే సీఎం కేసీఆర్‌కు నివేదిక సమర్పించనున్న పోలీసు ఉన్నతాధికారులు...

Telangana Drug Rockets: తెలంగాణలో డ్రగ్స్ సరఫరా ప్రభుత్వానికి సవాలుగా మారుతుంది. స్వయంగా సీఎం కేసీఆర్ డ్రగ్స్ కట్టడికి ఆదేశించినప్పటికీ డ్రగ్స్ కేసులు వెలుగుచూడటం ఆందోళన కల్గిస్తోంది. తాజాగా రాడిసన్ హోటల్ లోని పుడ్డింగ్ అండ్ మింట్ పబ్ లో మాదక ద్రవ్యాల వినియోగం తెరపైకి రావడం రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయంశంగా మారింది. డ్రగ్స్ అంశంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో సీరియస్ గా దృష్టి పెట్టాలని మరోసారి సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది.

గంజాయి, నార్కోటిక్ డ్రగ్స్ వాడకంపై చర్యలు తీసుకోవాలని.. తెలంగాణలో వాటిని సమూలంగా నిర్మూలించడానికి సామాజిక బాధ్యతతో వినూత్న రీతిలో ఆలోచన చేయాలని సూచిస్తున్నారు. డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతడి వారినైనా ఉపేక్షించ వద్దని.. నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను సైతం నిర్ద్వందంగా తిరస్కరించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే పోలీసు ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్ కు తాజా పరిస్థితులపై నివేదిక ఇచ్చే అవకాశాలున్నట్టు సమాచారం.

డ్రగ్స్ కు సంబంధించి వైద్య పరీక్షలు ఎవరికి చేయించాలో వారికి చేయించాలంటూ పరోక్షంగా సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం స్పందిస్తూ మాదక ద్రవ్యాల విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ప్రతిపక్షాల ఆరోపణలు సీఎం కేసీఆర్ కు సవాల్ గా మారుతున్నాయి. ఎక్సైజ్ అధికారులతో కలిసి గతంలో బార్లు పబ్ యజమానులతో గతంలో సమావేశం నిర్వహించినట్లుగానే మరోసారి సమావేశం నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సిద్ధమవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories