తెలంగాణలో మరో రెండ్రోజులు అసెంబ్లీ సమావేశాలు..ఎందుకో తెలుసా?

తెలంగాణలో మరో రెండ్రోజులు అసెంబ్లీ సమావేశాలు..ఎందుకో తెలుసా?
x
Highlights

తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను ఈ నెలలో మరో రెండు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. వచ్చే సోమ, మంగళవారాల్లో అంటే 12, 13వ తేదీలలో అసెంబ్లీ...

తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను ఈ నెలలో మరో రెండు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. వచ్చే సోమ, మంగళవారాల్లో అంటే 12, 13వ తేదీలలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విటర్‌లో తెలిపింది. జీహెచ్ ఎంసి చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతో పాటు హై కోర్టు సూచించిన మరి కొన్ని అంశాల్లో చట్టాలు చేయాల్సి ఉండడంతో ప్రభుత్వం అసెంబ్లీని సమావేశ పర్చాలని ఆలోచిస్తున్నట్టు సీఎంఓ వివరించింది. ఇందుకు సంబంధించిన తుది నిర్ణయాన్ని శుక్రవారం తీసుకునే అవ‌కాశం ఉంది. అయితే ఈ మధ్య కాలంలో నిర్వహించిన అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల్లో కొత్త రెవెన్యూ చ‌ట్టంతో పాటు ప‌లు కీల‌క‌మైన బిల్లుల‌కు అసెంబ్లీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

ఇక పోతే ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ తో పాటు జీహెచ్ఎంసీలో గతంలో తీసుకొచ్చిన చట్టాలపై ప్రజలు అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో వాటిని సవరించే అవకాశం ఉండొచ్చని తెలుస్తున్నది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ప్రభుత్వం శుక్రవారం వెల్లడించనుందని సమాచారం. ఇక డిసెంబర్ చివరివారంలో హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ భావిస్తున్నది. ఎన్నికలకు సంబంధించిన కసరత్తు కూడా ముమ్మరంగా జరుగుతున్నది.

Show Full Article
Print Article
Next Story
More Stories