Telangana: తెలంగాణ బడ్జెట్‌పై హైకోర్టు స్పందన.. ఏమందంటే..?

Telangana Govt Lunch Motion Petition Allowed by High Court
x

బడ్జెట్‌కు ఆమోదం తెలపని గవర్నర్.. గవర్నర్ తీరును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్

Highlights

Telangana: తెలంగాణ ప్రభుత్వం లంచ్‌మోషన్‌ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి

Telangana: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వర్సెస్‌ తెలంగాణ సర్కార్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బడ్జెట్‌ సిఫార్సులకు ఇంకా గవర్నర్‌ ఆమోద ముద్ర పడని నేపథ్యంలో గవర్నర్‌కు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. అయితే.. ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ముందుగా లంచ్‌ మోషన్‌ పిటిషన్‌కు అనుమతి ఇవ్వాలని అడ్వకేట్‌ జనరల్‌.. హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు.

రాష్ట్ర బడ్జెట్‌ ముసాయిదా ప్రతులకు ఆమోదం తెలపలేదు అని, గవర్నర్‌ ఆమోదం తెలపకపోతే కష్టతరమవుతుందని ఏజీ.. బెంచ్‌ ముందు విజ్ఞప్తి చేశారు. అయితే.. గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్న ఈ వ్యవహారంలో తామెలా జోక్యం చేసుకోగలుగుతామని బెంచ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. లంచ్ మోషన్ అనుమతిస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న అడ్వకేట్ జనరల్ సమాధానంతో.. అందుకు బెంచ్‌ అంగీకరించింది. అయితే పిటిషన్‌ రెడీగా ఉందా? అని ప్రశ్నించిన ధర్మాసనం.. సిద్ధంగా ఉంటే మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విచారణ చేపడతామని ఏజీకి స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories