ఒమిక్రాన్‌పై మరింత అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. కఠిన ఆంక్షలు...

ఒమిక్రాన్‌పై మరింత అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. కఠిన ఆంక్షలు...
Omicron Cases: థర్మా మీటర్, థర్మల్ స్కానర్లతో ఎంట్రీ పాయింట్ల వద్ద స్ర్కీనింగ్, మాస్క్ ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా
Omicron Cases in Telangana: తెలంగాణలో ఒమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుదల దృష్ట్యా విపత్తు నిర్వహణ చట్టం కింద విధించిన ఆంక్షలను ఈ నెల పదో తేదీ వరకు అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. డిసెంబరు 25 నుంచి జనవరి 2వతేదీ వరకు ఆంక్షలు విధిస్తూ గతంలో ఉత్తర్వులు వెలువడ్డాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో గడువు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ర్యాలీలు, బహిరంగ సభలు, మతపరమైన, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేధం విధించింది.
ఒమిక్రాన్, కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు తెలంగాణలో విధించిన ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. ర్యాలీలు, బహిరంగ సమావేశాలు సహా జన సమూహ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వొద్దని ఆదేశాలిచ్చారు. కరోనాపై ఆయన బీఆర్‌కే భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజా రవాణాలో, దుకాణాలు, మాల్స్, సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
ఆయాచోట్ల వినియోగదారులు భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలి. కార్యాలయాలు, పాఠశాల ఆవరణలను తరచుగా శుభ్రంచేయాలి. ఐఆర్ థర్మామీటర్, థర్మల్ స్కానర్, శానిటైజర్ అందుబాటులో ఉంచాలి. పాఠశాలల్లో సిబ్బంది, విద్యార్థులు మాస్కులు ధరించేలా విద్యా సంస్థల యాజమాన్యాలు చొరవ చూపాలి. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారిపై వెయ్యి జరిమానా విధించాలని మార్గదర్శనం చేశారు.
దేశంలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 17వేలు దాటిన కేసులు..
27 Jun 2022 5:17 AM GMTకాకినాడ జిల్లాలో దిశ మార్చుకున్న పులి
27 Jun 2022 4:39 AM GMTAmaravati: లీజుకు అమరావతి భవనాలు..!
27 Jun 2022 3:32 AM GMTకేంద్రంపై వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి ఫైర్
26 Jun 2022 8:14 AM GMTఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు కళకళ
26 Jun 2022 5:03 AM GMTబీహార్‌కు చెందిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు
26 Jun 2022 3:30 AM GMTతెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే..
25 Jun 2022 10:50 AM GMT
Indian Navy 2022: పదో తరగతి ఐటీఐ చదివారా.. ఇండియన్ నేవీలో 338...
27 Jun 2022 9:00 AM GMTRevanth Reddy: అంబానీ, అదానీ కంపెనీల రక్షణ కోసమే అగ్నిపథ్
27 Jun 2022 8:52 AM GMTMinister KTR: హైదరాబాద్‌కు జుమ్లా జీవులు వస్తున్నారు.. అయితే జుమ్లా...
27 Jun 2022 8:42 AM GMTగజ్వెల్ స్టేషన్ లో గూడ్స్ రైలును ప్రారంభించిన మంత్రులు
27 Jun 2022 8:31 AM GMTLIC Policy: ప్రతిరోజు రూ.100 పొదుపు చేయండి.. మెచ్యూరిటీపై 20 లక్షలు...
27 Jun 2022 8:30 AM GMT