తెలంగాణలో దేవాలయాలకు టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

Telangana Govt Decides to Form Boards for Temples
x

తెలంగాణలో దేవాలయాలకు టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

Highlights

తెలంగాణలోని ఆలయాల్లో సమూల మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది.

తెలంగాణలోని ఆలయాల్లో సమూల మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవాలయానికి సంబంధించిన తరహాలో ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా చర్యలు చేపట్టనుంది.1987 దేవాదాయ చట్టానికి సవరణను రేవంత్ రెడ్డి సర్కార్ ఆమోదించింది. ఈ ఏడాది మార్చిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందు ఈ బిల్లును కేబినెట్ ఆమోదం తెలపనుంది.

రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల నిర్వహణలో మరింత పారదర్శకతను తీసుకురావడానికి ఈ చట్ట సవరణ దోహదపడుతోంది. ఈ చట్ట సవరణ ద్వారా టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు వెసులుబాటు లభిస్తోంది. రాష్ట్రంలో ప్రధానంగా యాదగిరిగుట్ట, వేములవాడ ఆలయాలకు ప్రతి ఏటా 100 కోట్ల ఆదాయం వస్తోంది.

చట్ట సవరణ ద్వారా వారసత్వ ధర్మకర్తల వ్యవస్థను సంస్కరించేందుకు దోహదపడుతోంది. కొత్తగా ఏర్పాటు చేసే ఆలయ బోర్డుల్లో వంశపారంపర్య ధర్మకర్తలు సభ్యులను చేర్చే అవకాశం లభిస్తోంది. చట్టంలోని సెక్షన్ 151 ప్రకారం ఈ మార్పులు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆలయాలను ప్రభుత్వం ఏ,బీ, సీ కేటగిరిలుగా వర్గీకరించనుంది.

ప్రస్తుతం ఉన్న విధానంలో అత్యధిక ఆదాయం వచ్చే ఆలయాలను ఏ కేటగిరిలో ఉంచారు. చట్ట సవరణ ద్వారా 100 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ఆలయాలను ఏ కేటగిరి నుంచి తొలగించనున్నారు. టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తారు. ట్రస్టు బోర్డులో 10 నుంచి 11 మంది సభ్యులతో పాటు ఐదుగురు ఎక్స్ అఫిషియో సభ్యులు ఉండవచ్చు.

ఆలయ అభివృద్దికి అర్థవంతంగా సహకరించే వారి సామర్ధ్యం ఆధారంగా ఛైర్మన్ తో సహా బోర్డు సభ్యులను నియమిస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వసిస్తోంది. ప్రస్తుతం యాదాద్రి దేవాలయం వార్షిక ఆదాయం 230 కోట్లు, వేములవాడ దేవాలయం వార్షిక ఆదాయం 160 కోట్ల ఆదాయం ఉంది.2020 నంచి యాదాద్రి ఆదాయం 80 కోట్ల నుంచి గణనీయంగా పెరిగింది. బాసరలోని జ్ఞాన సరస్వతి దేవస్థానం, భద్రాచలంలోని సీతా రామచంద్ర స్వామి దేవస్థానం, కొండగట్టులోని ఆంజనేయ స్వామి దేవాలయం వంటి ఆలయాలు రూ.100 కోట్ల ఆదాయం కేటగిరీలో చేరనున్నాయని అంచనా.

యాదగిరిగుట్టకు 2008లో ఏర్పడిన ధర్మకర్తల మండలి 2010 వరకు కొనసాగింది. 2010 నుంచి 2024 వరకు దాదాపుగా 14 ఏళ్లుగా పాలకమండలి లేకుండానే ఆలయం కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories