Telangana Budget 2025-26: హైదరాబాద్‌ ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు రూ.7,032 కోట్లు

Telangana Govt Allocates 7032 Crores for Hyderabad Traffic Control in Telangana Budget 2025-26
x

Telangana Budget 2025-26: హైదరాబాద్‌ ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు రూ.7,032 కోట్లు

Highlights

Telangana Budget 2025-26: హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు రూ.7,032 కోట్ల అంచనాతో ఫ్లైఓవర్లు, అండర్ పాసెస్‌, రోడ్డు విస్తరణ పనులు చేయనున్నారు.

Telangana Budget 2025-26: హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు రూ.7,032 కోట్ల అంచనాతో ఫ్లైఓవర్లు, అండర్ పాసెస్‌, రోడ్డు విస్తరణ పనులు చేయనున్నారు. తెలంగాణ 2025-26 వార్షిక బడ్జెట్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు హెచ్-సిటీ ప్రణాళికను అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్‌లో 31 ఫ్లైఓవర్లు, 17 అండర్ పాసెస్ లు, 10 రోడ్డు విస్తరణ పనులను చేపట్టనున్నారు. రూ. 150 కోట్లతో సుందరీకరణ పనులు చేపడుతారు.

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలపై 20 ఎంఎల్‌డీ సామర్ధ్యం కలిగిన మురుగునీటి శుద్ది కేంద్రాల నిర్మాణం చేపట్టారు. మూసీ ప్రక్షాళలో భాగంగా గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ కింద గోదావరి జలాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నింపి వాటిని పునరుజ్జీవం కోసం చర్యలు చేపట్టనున్నారు.హైదరాబాద్ లోని 3,025 కి.మీ. మురుగు నీటి లైన్లు శుభ్రం చేశారు.2.39 లక్షల మ్యాన్ హోల్స్ పూడిక తీశారు. ఇప్పటివరకు మురుగునీటి వ్యవస్థకు సంబంధించిన ఫిర్యాదులు 25 శాతానికి పైగా తగ్గాయి. హైదరాబాద్‌లో వరద నీటిని నివారించేందుకు రూ.5,942 కోట్లతో సమగ్ర వరద నీటిపారుదల ప్రాజెక్టును మంజూరు చేశారు. పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ది సంస్థలలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్దికి రూ.4,500 కోట్లతో ప్రణాళికలు సిద్దం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories