తెలంగాణ రాష్ట్ర సర్కర్ తీరుతో దివాళ దిశగా సింగరేణి సంస్థ

Telangana Government owes Singareni Rs 13 crores | Singareni News
x

తెలంగాణ రాష్ట్ర సర్కర్ తీరుతో దివాళ దిశగా సింగరేణి సంస్థ

Highlights

Singareni: అప్పుల ఊబిలో సింగరేణి సంస్థ.. రాష్ట్రం వచ్చేనాటికి 3,500 కోట్ల అప్పు

Singareni: తెలంగాణ వచ్చిన కొత్తలో 3వేల 500కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ తో పటిష్టంగా ఉన్న సింగరేణి సంస్థ ప్రస్తుతం దివాళ దిశగా వెళ్తోంది. నాడు తన వద్ద ఉన్న డబ్బును ఎక్కువ వడ్డీకి ఇచ్చి, బ్యాంకులో బాండ్ల రూపంలో పెట్టుబడులు పెట్టిన సంస్థే ఇప్పుడు కార్మికుల జీతాల కోసం నెల నెల అప్పులు చేస్తోంది.

విశ్వసనీయ వర్గాల సమచారం మేరకు ఎస్బీఐ బ్యాంకుల నుంచి సింగరేణి సంస్థ ఏకంగా 85వేల కోట్ల రూపాయల అప్పు తీసుకుంది. రాష్ట ప్రభుత్వ విద్యుత్ సంస్థల నుండి 13వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకు పోవడం వల్ల, సింగరేణి సంస్థ అప్పులపాలైందని సంస్థ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఏటా కొన్ని బకాయిలు చెల్లించి సింగేణిని ఆదుకోవల్సిన రాష్ట్ర్ర ప్రభుత్వం ఆ పని చేయకుండా ఈ సంస్థ నుంచే నిధులు తీసుకోవడాన్ని కార్మిక సంఘాల నేతలు తప్పుబడుతున్నారు.

బొగ్గు, కరెంటు అమ్మకాలకు సంబంధించి సింగరేణికి రావల్సిన బకాయిలు 17,899 కోట్ల రూపాయలు ఉండగా అందులో రాష్ట్ర ప్రభుత్వం నుండి రావల్సిన నిధులే 13వేల 172 కోట్ల రూపాయల మేర ఉన్నాయి. వీటిని ఇప్పించడంలో తీవ్ర నిర్లక్షం చేస్తున్న రాష్ట్ర సర్కార్ వృద్ధి పన్నుల పేరుతో 12మంది ఎమ్మెల్యేలకు నెలనెలా 2కోట్ల రూపాయల చొప్పున 24 కోట్లు ఇస్తున్నది. రాష్ట సర్కార్ కనుసన్నల్లో పనిచేస్తున్న సీఎం.డి శ్రీధర్ ప్రభుత్వం ఏది చెబితే దానికి ఊ కొట్టడం వల్లే దివాళ దిశగా వెళ్తుందని కార్మిక సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.

సింగరేణికి తెలంగాణ ప్రభుత్వం 23వేల కోట్ల రూపాయల బకాయిలు పడ్డది. దాంతో సింగరేణి ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. సింగరేణి కార్మికులకు, డబ్బులు జీతాలు చెల్లించాలన్నాబ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. సింగరేణి శ్రేయస్సు కొరకు ఆరు జిల్లాలో 78వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక‌్షనమే చెల్లించాలని బీఎంఎస్ యూనియన్ డిమాండ్ చేస్తోంది.

తెలంగాణ వచ్చినప్పుడు 74 పైచిలుకు ఉన్న కార్మికులు ఇప్పడు 42వేలకు కుదించబడ్డారు. 25 వేల కోట్ల అప్పులు అయ్యాయి. ప్రభుత్వం సింగరేణిని కాపాడుకుంటూ, అప్పుల సమస్యను ఏ విధంగా సమతుల్యం చేస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories