రాకపోకలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన తెలంగాణ ప్రభుత్వం

రాకపోకలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన తెలంగాణ ప్రభుత్వం
x
Highlights

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. రాష్ట్రంలో కరోనా కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ను జూన్‌ 30 వరకు పొడిగించింది. ఇతర జోన్లలో జూన్‌ 7 వరకు మాత్రమే లాక్‌డౌన్‌ అమలవుతుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ 5.0 సంబంధించి శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదివారం సమీక్ష నిర్వహంచారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

అయితే అంతర్‌ రాష్ట్ర సర్వీసులు నడిపేందుకు మాత్రం ఆర్టీసీ, ప్రైవేటు బస్సులకు అనుమతి ఇవ్వలేదు. ఈ సమావేశంలో హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌కు అనుమతిపై సీఎం ఎలాంటి ప్రకటన చేయలేదు. మెట్రోరైలు, సినిమాహాళ్లు, బార్లు, ఆడిటోరియాలు ప్రస్తావన లేదు. వీటిపై ఒకటి రెండు రోజుల్లో మళ్లీ స్పష్టత ఇచ్చే వీలుంది.

ఇవీ ఆదేశాలు

* వాణిజ్య సముదాయాలు, దుకాణాలు రాత్రి 8 గంటల వరకు మాత్రమే నిర్వహించాలి.

* ఆసుపత్రులు, మెడికల్ దుకాణాలు కొనసాగుతాయి.

* ఇతర రాష్ట్రాలకు రాకపోకలపై నిషేధం ఎత్తివేత. ప్రయాణాలకు అనుమతులు అవసరం లేదు.

* రాష్ట్రంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతుంది.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories