VRAs: ప్రభుత్వ ఉద్యోగులుగా వీఆర్‌ఏలు.. ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

Telangana Government issues GO in Secretariat making VRAs Permanent as Government Employees
x

VRAs: ప్రభుత్వ ఉద్యోగులుగా వీఆర్‌ఏలు.. ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

Highlights

VRAs: వివిధ శాఖల్లో వీఆర్‌ఏలను భర్తీ చేసిన ప్రభుత్వం

VRAs: వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వీరిని రెవెన్యూ శాఖలోని సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్దీకరించనున్నట్టు తెలిపారు. వీఆర్ఏల అర్హతను బట్టి వారిని మొత్తం నాలుగు శాఖల్లో సర్దుబాటు చేయనున్నారు. పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, పురపాలకశాఖలో సర్దుబాటు చేయడమే కాదు వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నామని సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.

61 ఏళ్లు నిండిన వీఆర్ఏల ఉద్యోగాన్ని వారి వారసులకు ఇవ్వనున్నట్టు తెలిపారు. వీరి క్రమబద్దీకరణ సాధ్యం కానందున వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వనున్నారు. త్వరలోనే కారుణ్య నియామకం ద్వారా ఇచ్చే ఉద్యోగాలకు సంబంధించి వారసుల విద్యార్హతలను సేకరించే పనిలో ఉండాలన్నారు. వీరికి నిబంధనలనుసరించి,.. విద్యార్హతను బట్టి ఆయా శాఖల్లో ఉద్యోగం ఇవ్వనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 20వేల 555 మంది వీఆర్ఏలు పని చేస్తున్నారు. వీరిలో చాలా మంది నిరక్షరాస్యులు ఉన్నారు. డిగ్రీ, పీజీ చేసిన వారిని జూనియర్ అసిస్టెంట్లుగా, ఇంటర్ చదివిన వారిని రికార్డు అసిస్టెంట్లు, సబార్డినేటర్లుగా.. మిగిలిన వారిని ఆయా శాఖల్లో హెల్పర్లుగా నియమించే అవకాశాలున్నాయి. 2014 జూన్ 2 అనంతరం 61 ఏళ్లు ఉండి వీఆర్ఏ విధులు నిర్వహిస్తూ ఏ కారణం చేతనైనా మరణిస్తే వారి వారసులకు ఉద్యోగం ఇవ్వనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories