తెలంగాణ రైతులకు మరో షాక్..? ఇతర పంటలు వేసిన రైతులకే రైతు బంధు..?

Telangana Government is Ready to Impose Restrictions on the Implementation of Rythu Bandhu
x

రైతుబంధు అమలుపై ఆంక్షలు పెట్టేందుకు సర్కార్ రెడీ..!

Highlights

* రైతుబంధు అమలుపై ఆంక్షలు పెట్టేందుకు సర్కార్ రెడీ..! * వ్యవసాయశాఖ ఎలాంటి స్పష్టత ఇవ్వడంలేదంటున్న రైతులు

Telangana: తెలంగాణలో రానున్న రోజుల్లో రైతులకు గడ్డు పరిస్థితి ఎదురుకానుందా? ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధుపై ఆంక్షలు అమలు ఉండనున్నయా...? యాసంగి సీజన్‌లో వరి కొనలేమని కేంద్రం స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేస్తుందా...? రాష్ట్ర వ్యాప్తంగా అమలౌవుతున్న రైతు బంధు ఇకముందు వరికీ బదులు ప్రత్యామ్నాయ పంటలకు ఇవ్వాలని అధికారులు సీఎం ఎలాంటి నివేదిక ఇచ్చారు. ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో రైతు బంధుకు నీలి నీడలు కమ్ముకొనెల ఉన్నాయన్న ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి కాబట్టి రైతు బంధు నిరంతర ప్రక్రియ అని సీఎం కేసీఆర్ చాలాసార్లు స్పష్టం చేశారు.

గతం కంటే తెలంగాణ సాగు విస్తీర్ణం పెరగడం, నీటి లభ్యత, ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ప్రస్తుతం గణనీయంగా రైతులు వరి సాగు చేస్తున్నారు. అయితే యసంగి పంట సీజన్ వరి ధాన్యం కొనుగోలుపై మొదలైన సందిగ్దత రాను రాను కేంద్రం వర్సెస్ రాష్ట్రం అన్నట్లు తయారైంది. గడిచిన అసెంబ్లీ సమావేశాల్లో రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పిన సర్కార్ కేంద్రం చేతులు ఎత్తేయడంతో రైతుల విషయంలో ఎటు తేల్చుకోలేక పోతుంది. రైతు వేదికల ద్వారా ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్తున్న ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని పీయూష్ గోయల్ స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధుపై యూ టర్న్ తీసుకునే ఆలోచన చేస్తుందట.

రైతుల్లో గందరగోళం సృష్టించడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టిన సీఎం రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో రైతు బంధు ఆగదని స్పష్టం చేశారు. అయితే నేరుగా రైతాంగానికి అల్టిమేటం ఇస్తే రైతులకు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉన్నందున ఉద్దేశపూర్వకంగానే అధికారుల ద్వారా లీకులు ఇప్పిస్తూన్నరనే విమర్శలు వినిపిస్తున్నాయి. దానిలో బాగంగానే వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ పంటలు వేయని వారికి రైతు బంధు కట్ అనే నిబంధన పెట్టాలని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. అయితే రైతు బంధు యధావిధిగా కొనసాగిస్తారా లేక ఆపేస్తారా అన్నది మరో రెండు రోజుల్లో తేలనుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories