Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు.. కొత్త జోనల్‌ విధానానికి ఆమోదం

Telangana Government has Speedup the Process of Giving Promotions to Employees in District Wise and Zonal Wise
x

తెలంగాణ ప్రభుత్వం (ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

*శాఖల వారిగా ప్రమోషన్లు జరిగితేనే ఖాళీల గుర్తింపు *పీఆర్సీ నివేదిక ప్రకారం లక్షా 91వేల 126 ఉద్యోగాలు

Telangana: రాష్ట్రంలోని ఉద్యోగులకు జిల్లాలు, మండలాల వారిగా ప్రమోషన్లు కల్పించే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. కేంద్రం కొత్త జోనల్‌ విధానానికి ఆమోదం తెలిపిన నేపథ్యంలో టీఆర్ఎస్‌ సర్కార్‌ గెజిట్‌ను జారీ చేసింది.

దీంతో ఉద్యోగుల సర్దుబాటు పెండింగ్‌లో పడింది. కాగా ఉద్యోగుల సర్దుబాటు, ప్రమోషన్లు, శాఖల వారిగా జరిగితేనే పక్కగా ఖాళీల గుర్తింపు జరుగుతుందని, అనంతరం ఉద్యోగ నోటిఫికేషన్స్‌ వెలుబడనున్నట్లు చెబుతున్నారు ఉద్యోగులు.

అన్ని శాఖల్లో కలిపి 75వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారు. అందులో ఉద్యోగుల బదిలీలైన తర్వాత పూర్తి లెక్కలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. అటు వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షా 91వేల 126 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని పీఆర్సీ తన రిపోర్ట్‌లో పేర్కొంది.

ఈ నివేదిక ప్రకారం మంజూరైన పోస్టుల్లో 39 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నాయని వెల్లడించారు. కేసీఆర్‌ మాత్రం 75వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయంటున్నారు. ప్రభుత్వం చూపించే ఖాళీలు, పీఆర్సీ కమిటీ చూపిస్తున్న ఖాళీలకు పొంతన లేకపోవడంతో నిరుద్యోగులు డైలామాలో పడ్డారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఎప్పుడు వేస్తుందా అని ఎదురు చూస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories