Rythu Beema Funds: తెలంగాణా రైతులకు రైతు భీమా.. నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

Rythu Beema Funds: తెలంగాణా రైతులకు రైతు భీమా.. నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
x
Farmers
Highlights

Rythu Beema Funds:రైతులను అదుకునేందుకు తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భీమా పథకానికి సంబంధించి నిధులను విడుదల చేసింది.

Rythu Beema Funds:రైతులను అదుకునేందుకు తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భీమా పథకానికి సంబంధించి నిధులను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రైతుకు వెన్నుదన్నుగా ఉండేందుకు గాను ఈ సాయం అందించనుంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజను నడుస్తుండటంతో ఈ సాయం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

2020-21 ఆర్థిక సంవత్సరం రైతు బీమా స్కీమ్ అమలు కోసం రూ.1173.54 కోట్ల ప్రీమియం నిధులు రిలీజ‌య్యాయి. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్థన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 18 ప‌ర్సెంట్ జీఎస్టీతో కలిపి రూ. 1141 కోట్ల ప్రీమియం, రూ. 32.54 కోట్ల స్టాంప్ డ్యూటీ ఫండ్స్ రిలీజ్ చేసింది ప్ర‌భుత్వం.

2020 ఆగస్టు 14 నుంచి 2021 ఆగస్టు 13 వరకు రైతులకు ఈ బీమా స్కీమ్ వర్తించనుంది. ఈ సొమ్ము భారతీయ బీమా సంస్థ – ఎల్ఐసీకి చెల్లించేందుకు తెలంగాణ స‌ర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల 32.73 లక్షల మంది రైతులు ఈ బీమా పరిధిలోకి వస్తారు. 59 ఏండ్లు నిండిన రైతులు ఈ ఏడాదితో అనర్హులుగా ప‌రిగ‌ణించ‌బ‌డ‌తారు. 18 ఏండ్లు నిండి.. కొత్తగా త‌మ పేర్లు రికార్డు చేసుక‌న్న‌ దాదాపు 2 లక్షల మంది రైతులు కొత్త‌గా రైతు బీమా పథకం పరిధిలోకి వస్తున్నారు.

2018 ఆగస్టు 14న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రైతు బీమా పథకం స్టార్ట్ చేయ‌గా… రెండేళ్లలో ఎల్ఐసీకి రైతుబీమా స్కీమ్ కోసం ప్రీమియం కింద రూ. 1775.95 కోట్ల పేమెంట్స్ జరిగాయి. రెండేళ్లలో ఇప్పటి వరకు 32,267 మంది రైతు ఫ్యామిలీల‌కు రైతుబీమా స్కీమ్ వర్తించడంతో… ఎల్ఐసీ ద్వారా ఒక్కో రైతు కుటుంబానికి 5 లక్షల చొప్పున రూ.1613.35 కోట్లు గ‌వ‌ర్న‌మెంట్ చెల్లించింది. ఈ నెల ఆగస్టు 13 వరకు గతేడాది చెల్లించిన ప్రీమియం వర్తించ‌నుంది. కాగా ఎల్ఐసీ వద్ద పరిశీలనలో ఉన్న 1800 మంది రైతుల బీమా క్లైములు కోసం ఇంకా రూ. 90 కోట్లు పే చెయ్యాల్సి ఉంది. రైతు ఏ రీజ‌న్ వ‌ల్ల చ‌నిపోయినా ఐదారు రోజుల్లో రైతు ఫ్యామిలీకి చెందిన నామినీ పేరిట బ్యాంకు అకౌంట్‌లో 5 లక్షలు జమ చేస్తున్న విషయం తెలిసిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories