30 వరకూ లాక్ డౌన్.. 1-9 వరకూ అందరూ పాస్.. సీఎం కేసీఆర్!

30 వరకూ లాక్ డౌన్.. 1-9 వరకూ అందరూ పాస్.. సీఎం కేసీఆర్!
x
KTR (File Photo)
Highlights

తెలంగాణలో లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో ఈ నెల 30 వరకు లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు.

తెలంగాణలో లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో ఈ నెల 30 వరకు లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ ని పొడిగించడం తప్ప మరో మార్గం లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అయన వెల్లడించారు. లాక్ డౌన్ కి ప్రజలంతా సహకరించాలని, కరోనా భూతాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. నిత్యావసర వస్తువులకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు.

ఇక తెలంగాణా విద్యార్ధులకి శుభవార్తని అందజేశారు సీఎం కేసీఆర్.. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్ లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విధ్యార్ధులను పాస్ చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకర్తించారు. ఇందుకు కేబినేట్ ఆమోదం తెలిపిందని అన్నారు, ఇక పదో తరగతి పరీక్షలకి నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ విషయంలో విద్యార్ధుల తల్లితండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

తెలంగాణలో ఇవాళ కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, దీనితో ఇప్పటి వరకు రాష్ట్రంలో 503 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టుగా వెల్లడించారు, పాజిటివ్ కేసుల నుంచి 96 మందికోలుకుని..డిశ్చార్జి అయ్యారని ప్రస్తుతం రాష్ట్రంలో 393 యాక్టీవ్ పాజిటివ్ కేసులు ఉన్నాయని అన్నారు. ఇక 14 మంది చనిపోయారని స్పష్టం చేశారు. మర్కజ్ అన్ని కేస్ లను పట్టుకున్నామని వెల్లడించారు. కొత్త కేసులు రాకపోతే మన రాష్ట్రంలో కరోన కేస్ లు లేనట్టేనని కేసీఆర్ చెప్పుకొచ్చారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories