తెలంగాణ ప్రజలెవరూ ఏపీకి వెళ్లకుండా నిషేధం

తెలంగాణ ప్రజలెవరూ ఏపీకి వెళ్లకుండా నిషేధం
x
Highlights

కరోనా వ్యాధి తీవ్రత నేపథ్యంలో సరిహద్దు జిల్లాలలో నివసిస్తున్న పౌరులకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

కరోనా వ్యాధి తీవ్రత నేపథ్యంలో సరిహద్దు జిల్లాలలో నివసిస్తున్న పౌరులకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రజలెవరూ ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా నిషేదం విధించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్రకు కూడా వెళ్లకుండా సర్కార్ బ్యాన్ చేసింది.

ఇక మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంది. వైద్యం, అత్యవసర పనులకు కూడా రెండు రాష్ట్రాలకు వెళ్లడానికి వీలు లేదని సరిహద్దుల్లోని ప్రాంతాల ప్రజలను ఆదేశించింది. నిర్ణయం అమలుకు పోలీసు బలగాలను పెంచింది. భద్రతను కట్టుదిట్టం చేసింది. ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో ఖమ్మం, నల్గొండ జిల్లాల వాళ్లు కూడా విజయవాడ, గుంటూరు వైపు వెళ్లడానికి వీలు లేకుండా ప్రభుత్వం భద్రతను పెంచింది. అలాగే కర్నూలు జిల్లాలో కేసులు ఎక్కువగా ఉండడం.. తెలంగాణలోని గద్వాల, మహబూబ్‌నగర్‌ జిల్లాల ప్రజలు అక్కడికి వెళుతున్న నేపథ్యంలో రాకపోకలను నిషేధించింది.

ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1403కి చేరింది. ఇందులో 1051యాక్టివ్ కేసులు ఉండగా, 321 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 31 మంది మృతి చెందారు. దీనికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో కూడా కరోనా కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. రాష్ట్రంలో 9915 కేసులు నిర్ధారణ కాగా.. 432 మంది మరణించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories