Breaking News: తెలంగాణలో నో లాక్‌డౌన్

Telangana Government Ends Covid 19 Lockdown Completely as corona cases decreased says CM KCR
x

తెలంగాణ కాబినెట్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Unlock Telangana 2021: అన్ని రకాల నిబంధనలు పూర్తిగా ఎత్తివేత

Unlock Telangana 2021: తెలంగాణలో లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చిందని పేర్కొన్న కేబినెట్ వైద్యారోగ్యశాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మే 12 నుంచి జూన్ 19 వరకు కొనసాగిన లాక్‌డౌను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. లాక్‌డౌన్ ఎత్తివేతపై కేంద్రం కొత్త గైడ్‌లైన్స్ జారీచేసింది. ఈ అన్‌లాక్‌ మార్గదర్శకాలు ఈరోజు నుంచే అమల్లోకి రానున్నట్టు వెల్లడించారు. ఇక యథావిధిగా ప్రభుత్వ కార్యాలయాలు, మెట్రో, ఆర్టీసీ సేవలు తెరుచుకోనున్నాయి.

తెలంగాణలో అన్‌లాక్‌ తక్షణమే అమల్లోకి రానుంది. దాంతో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు యథావిధిగా నడవనున్నాయి. రేపటి నుంచి సినిమా హాళ్లు, జిమ్‌ సెంటర్లు, క్లబ్‌లు, పబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు, షాపింగ్‌ మాల్స్, వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరుచుకోనున్నాయి. అయితే.. జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశంలో మాత్రం భౌతిక దూరం, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం సూచించింది. వాస్తవానికి రాత్రి కర్ఫ్యూ విధింస్తారన్న ఊహగానాలు వచ్చాయి. కానీ, ప్రభుత్వం మాత్రం ఒకేసారిగా అన్‌లాక్ కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో యథావిధిగా ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ బస్సులు, మెట్రో సర్వీసులు నడవనున్నాయి. సెకండ్ వేవ్‌లో మొత్తంగా 38 రోజుల పాటు లాక్‌డౌన్‌ను అమలు చేసింది. మే 12 నుంచి జూన్ 19 విడతల వారీగా లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చింది..

అన్ని కేటగిరిల విద్యా సంస్థలను, పూర్తి స్థాయి సన్నద్ధతతో, జూలై 1 నుంచి ప్రారంభించాలని కేబినెట్ విద్యాశాఖను ఆదేశించింది. ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతో, రాష్ట్ర కేబినెట్ అన్‌లాక్‌ పై నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ ఎత్తివేసినంత మాత్రానా కరోనా విషయంతో నిర్లక్ష్యంగా ఉండకూడదని హెచ్చరించింది.. కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణకు, ప్రజలు సంపూర్ణ అవకాశం అందించాలని రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం కోరింది.

మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేయాలని సూచించినా.. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా లాక్‌డౌన్‌ సంపూర్ణంగా ఎత్తివేసింది. మరోవైపు.. థర్డ్ వేవ్ ప్రమాదం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వార్నింగ్ ఇచ్చినా తెలంగాణ సర్కార్ మాత్రం పట్టించుకోలేదు.

రాష్ట్రాల అన్‌లాక్‌ పై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో అన్‌లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. అదే తరహాలో ఇప్పుడు తెలంగాణ సర్కార్‌ కూడా నిర్ణయం తీసుకుంది. అంతా సక్రమంగా ఉన్నట్టు నిర్దారించాకే.. వైద్యారోగ్యశాఖ నివేదిక ఇచ్చిన తర్వాతే అన్‌లాక్‌ పై ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మార్గదర్శకాలు విడుదల చేసింది. అంతేకాదు.. కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షల సడలింపులతో మార్కెట్లు రద్దీగా మారుస్తున్నారని కేంద్రం ఆందోళన చెందుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories