School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు పాఠశాలలకు సెలవు..

School Holidays
x

School Holidays

Highlights

Telangana government declares holidaySchool Holiday: విద్యార్థులకు గుడ్ న్యూస్. వరుసగా రెండు రోజులు సెలవులు వస్తున్నాయి. రేపు శనివారం హజ్రత్ అలీ...

Telangana government declares holiday

School Holiday: విద్యార్థులకు గుడ్ న్యూస్. వరుసగా రెండు రోజులు సెలవులు వస్తున్నాయి. రేపు శనివారం హజ్రత్ అలీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం పవిత్ర రంజాన్ మాసం 21వ తేదీన వచ్చే హజ్రత్ అలీ షహాదత్ ను గుర్తు చేసుకుంటూ సెలవు దినంగా ప్రకటించింది. కానీ తర్వాత ఈ సెలవును మార్చి 22 కు మార్చింది. ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ..అది సాధారణమైంది కాదు. ఐచ్చికం అవుతుంది. సెలవు ద్రుష్ట్యా పాఠశాలలు, ఇతర కళాశాలలు ముఖ్యంగా మైనార్జీ సంస్థలు సెలవులు ప్రకటించవచ్చు. ఎల్లుండి ఆదివారం కాబట్టి రేపు, ఎల్లుండి రెండు రోజులు సెలవులు వస్తున్నాయి.

అటు వాహనదారులకు కూడా ముఖ్యమైన అలర్ట్. ఏంటంటే హజ్రత్ అలీ వర్ధంతీ ఊరేగింపు సందర్భంగా నేడు మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 8గంటల వరకు హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను ప్రకటించారు.ఈ ఊరేగింపు చార్మినార్ నుండి ప్రారంభమైతుంది. అక్కడి నుంచి చర్కమాన్, గుల్జార్ హౌస్, పథేర్ గట్టి, మదీనా, టిప్పు ఖానా మసీదు, చట్టా బజార్, పురానీ హవేలీ, ఏపీఏటీ జంక్షన్, దారుల్షిఫా, ఎస్‌జే రోటరీ , అబిద్ అలీ ఖాన్ కంటి ఆసుపత్రి మీదుగా కాలీ కబర్ సమీపంలోని మసీదు ఇ ఇమామియా వైపు సాగుతుందని తెలిపారు.

మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల మధ్య, నయాపూల్ నుండి హిమత్‌పురా, నాగులచైంట లేదా చంద్రాయణగుట్ట వైపు ప్రయాణించేవారు మదీనా, సిటీ కాలేజ్, మూసబౌలి, చౌక్, కిల్వత్ లేదా సాలార్ జంగ్ మ్యూజియం మీదుగా వెళ్లాలి. సాయంత్రం 4:00 గంటల నుండి 7:00 గంటల మధ్య, శివాజీ వంతెన నుండి దారుల్షిఫా , ఎతాబార్ చౌక్ వైపు ప్రయాణించేవారు మదీనా-గుల్జార్ హౌస్ మార్గంలో వెళ్లాలని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories