కేసీఆర్ సర్కార్ కఠిన నిర్ణయం.. మాస్క్ లేకుంటే వెయ్యి

కేసీఆర్ సర్కార్ కఠిన నిర్ణయం.. మాస్క్ లేకుంటే వెయ్యి
x
CM KCR(File photo)
Highlights

తెలంగాణలో లాక్‌డౌన్ మే 29 వరకు పొడిగిస్తూ సీఎం కేేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

తెలంగాణలో లాక్‌డౌన్ మే 29 వరకు పొడిగిస్తూ సీఎం కేేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.లాక్ డౌన్ విధించడంతో పాత్ కొన్ని సడలింపులు ఇచ్చారు. మినహాయిపులు ఇవ్వడంతో కొంత మంది రకరకాల కారణాలతో ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నారు. ఈ నేపద్యంలో కచ్చితంగా ముఖానికి మాస్కు ధరించండి. కరోనా ముప్పు లేదనీ లైట్‌గా తీసుకున్నారో.. మీ జేబుకు చిల్లు తప్పదు.

రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించకపోతే రూ.1000 ఫైన్ విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. Of లాక్‌డౌన్‌ పొడిగింపు, అమలుకు సంబంధించి గురువారం జారీ చేసిన జీవోలో మాస్కు నిబంధనను ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ప్రజలు మాస్కు కచ్చితంగా ధరించాలని, లేనిపక్షంలో ఫైన్ విధించే అధికారం పోలీసులకు, అధికారులకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. దాని అమలుపై దిశానిర్దేశం చేస్తూ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ జీవో జారీ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories