School Holiday: విద్యార్థులకు గుడ్ న్యూస్..ఆ రోజు పాఠశాలలకు సెలవు

School Holiday: విద్యార్థులకు గుడ్ న్యూస్..ఆ రోజు పాఠశాలలకు సెలవు
x
Highlights

School Holiday: విద్యార్థులకు బిగ్ గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. మరోసారి పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి...

School Holiday: విద్యార్థులకు బిగ్ గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. మరోసారి పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు ముగిశాయి. తెలంగాణలో శనివారం పాఠశాలల ప్రారంభమవ్వగా..ఏపీలో సోమవారం నుంచి విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో పండగ సంబురాలతో గడిపిన పిల్లలు, మళ్లీ స్కూల్స్ బాట పట్టారు. సంక్రాంతి పండగలో పిల్లలు తమ సొంతూర్లకు వెళ్లి కుటుంబాలతో కలిసి ఆనందంగా గడిపారు.

సంక్రాంతి హంగామా ముగిసిన తర్వాత విద్యార్థులు నగరాలకు తిరిగి వెళ్లారు. కొద్ది రోజుల నుంచి నిర్మానుష్యంగా కనిపించిన హైదరాబాద్ నగరం మళ్లీ కళకళలాడుతోంది. పాఠశాల బస్సులు తిరిగి రోడ్డెక్కుతున్నాయి. పిల్లలు స్కూల్ కు వెళ్తూ సెలవుల్లో చేసిన హంగామా గుర్తు చేసుకుంటూ మళ్లీ సెలవులు ఎప్పుడు వస్తాయోనని ఎదురుచూస్తున్నారు.

జనవరిలో విద్యార్ధలకు మరికొన్ని సెలవులు వస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు మరో రోజును సెలవుగా ప్రకటించింది. అయితే అది మైనార్టీ విద్యాసంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం కాబట్టి ఆ రోజు జాతీయ సెలవు ఉంది. అయితే ఈసారి మాత్రం ఇది ఆదివారం రావడం వల్ల విద్యార్థులు ప్రత్యేక సెలవు పొందలేరు. షబ్ ఏ మేరాజ్ ముస్లిం క్యాలెండర్ ప్రకారం జనవరి 28న షబ్ ఏ మేరాజ్ కావడంతో తెలంగాణలోని మైనార్టీ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జనవరిలో ఇదే చివరి సెలవు.

జనవరి 28న మైనార్టీ స్కూల్లకు ప్రభుత్వమే సెలవు ప్రకటించింది. మిగతా పాఠశాలల నిర్వహణ లేదా హాలీడే పై సొంతంగా నిర్ణయం తీసుకోనున్నాయి. మరి ఆ రోజు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఇస్తారో లేదో చూడాల్సింది.

Show Full Article
Print Article
Next Story
More Stories