పార్టీలలో మొదలైన టికెట్ల సందడి.. అధికార టీఆర్‌ఎస్ టికెట్ కోసం గట్టి పోటీ

పార్టీలలో మొదలైన టికెట్ల సందడి.. అధికార టీఆర్‌ఎస్ టికెట్ కోసం గట్టి పోటీ
x
Highlights

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పార్టీలలో టికెట్ల హడావిడి మొదలైంది. ఎన్నికల తేది ప్రకటన రాకముందే ఆశావాహులు పైరవీలు...

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పార్టీలలో టికెట్ల హడావిడి మొదలైంది. ఎన్నికల తేది ప్రకటన రాకముందే ఆశావాహులు పైరవీలు మొదలుపెట్టారు. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ లో వార్డు మెంబర్ నుంచి మేయర్ స్థానం వరకు గట్టి పోటీ ఉంది. టికెట్ ఆశించే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. టికెట్ తమకే ఇవ్వాలని అనుచరులు ఒత్తిడి పెంచడం తో ఏం చెయ్యాలో అర్థంకాక ఎమ్మెల్యేలు, మంత్రులు తలలు పట్టుకుంటున్నారు .

ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల సమయం రానే వచ్చింది. రిజర్వేషన్లు, వార్డుల విభజన తదితర అంశాలపై దాఖలైన పిటిషన్ల విచారణ ముగియడంతో హై కోర్టు పుర ఎన్నికలకు పచ్చ జెండా ఊపింది. ఎన్నికల తేది ప్రకటన కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎదురుచూస్తున్నాయి.

హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీలో టికెట్ ల డిమాండ్ భారీగా ఉంది. ఒక్కో వార్డు , డివిజన్ నుంచి కనీసం అరడజను మంది టికెట్ కోసం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ , బిజెపి, టిడిపి నుండి టిఆర్ఎస్ లోకి నాయకులు చేరిన నియోజక వర్గాల్లో టికెట్ల సమస్య ఎక్కువగా ఉంది. కొందరు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో, మరికొందరు మంత్రులతో పైరవీలు మొదలుపెట్టారు.

గతంలో ఉన్న మున్సిపాలిటీలు కాక కొత్తగా కొన్ని మున్సిపాలిటీ లను ఏర్పాటు చేసింది సర్కార్. కొన్ని పాత మున్సిపాలిటీలను కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లోని బోడుప్పల్, పిర్జది గూడ, బండ్లగూడా, జవహర్ నగర్ లను కొత్తగా కార్పొరేషన్లుగా మార్చడంతో అధికార పార్టీ టికెట్ కు గట్టి పోటీ ఉంది.

ఒక్కో వార్డు లేదా డివిజన్ లో టీఆర్ఎస్ లో రెండు మూడు గ్రూప్ లు ఉన్నాయి. మీకు అసెంబ్లీ ఎన్నికల్లో పని చేశాను కాబట్టి నాకే టికెట్ ఇప్పించాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తుండడంతో ఏం చేయాలో ఎమ్మెల్యేలకు అర్థం కావడం లేదు. మంత్రులది అదే పరిస్థితి. టికెట్లను అధిష్టానం కేటాయిస్తుందని కొందరు ఎమ్మెల్యేలు చేతులు దులుపుకోవడంతో అనుచరులు అసంతృప్తి చెందుతున్నారు.

నవంబర్ నెలాఖరు లోపు మున్సిపల్ ఎన్నికలు ముగించాలని సర్కార్ పట్టుదలగా ఉంది. గత జెడ్పీ ఎన్నికల మాదిరిగానే అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల కైవసం చేసుకోవాలని టిఆర్ఎస్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories