తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే అమలు చేయాలి – TGOA డిమాండ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే అమలు చేయాలి – TGOA డిమాండ్
x

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే అమలు చేయాలి – TGOA డిమాండ్

Highlights

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు మరియు బదిలీల అంశంపై తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం (TGOCA) గళమెత్తింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు మరియు బదిలీల అంశంపై తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం (TGOCA) గళమెత్తింది. ఈ మేరకు సంఘం అధ్యక్షులు శ్రీ ఏలూరి శ్రీనివాస రావు మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ బి. శ్యామ్ గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు చీఫ్ సెక్రటరీకి గార్లకి సమర్పించిన వినతి పత్రాల వివరాలను పత్రికా ముఖంగా వెల్లడించారు.

ముఖ్యమైన డిమాండ్లు.

1.రెండో పీఆర్సీ (2nd PRC) తక్షణ అమలు - బడ్జెట్ కేటాయింపు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన రెండో వేతన సవరణ (PRC) విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని TGOA డిమాండ్ చేసింది.

42% ఫిట్‌మెంట్: ద్రవ్యోల్బణం మరియు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా 42% ఫిట్‌మెంట్ ప్రకటించాలని కోరింది. ప్రస్తుతం ఇస్తున్న 5% మధ్యంతర భృతి (IR) ఏమాత్రం సరిపోదని స్పష్టం చేసింది.

బకాయి ఉన్న డీఏలు: 1-1-2024 నుండి 1-7-2025 వరకు బకాయి ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరింది.

ఆర్థిక ఇబ్బందులు పీఆర్సీ నివేదిక గడువు ముగిసి ఇప్పటికే 22 నెలలు దాటిపోయిందని, దీనివల్ల ఉద్యోగులు పిల్లల ఫీజులు, వైద్య ఖర్చులు మరియు ఈఎంఐలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని వివరించింది.

బడ్జెట్ కేటాయింపు: 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో పీఆర్సీ అమలుకు అవసరమైన నిధులను కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి గారిని కోరింది.

2.బదిలీలపై నిషేధం ఎత్తివేత గత ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల కోసం బదిలీల ప్రక్రియను ప్రారంభించాలని సంఘం విజ్ఞప్తి చేసింది.

గత 6 నుండి 13 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులకు ఈసారి తప్పకుండా బదిలీ అవకాశం కల్పించాలని కోరింది.

మే/జూన్ 2026 గడువు: 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే బదిలీల నిషేధాన్ని ఎత్తివేసి ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరింది.

గతంలో 40% పరిమితి విధించడం వల్ల మరియు స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా చాలా మంది ఉద్యోగులు బదిలీలకు దూరం అయ్యారని సంఘం గుర్తు చేసింది.

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి, వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించుకుని అమలు చేయాలని కోరారు.


Show Full Article
Print Article
Next Story
More Stories