KCR: కేసీఆర్ కుటుంబంలో విషాదం.. ఆయన సోదరి కన్నుమూత..!

Telangana Former CM KCR Sister Cheeti Sakalamma Passed Away Due To Health Issue
x

KCR: కేసీఆర్ కుటుంబంలో విషాదం.. ఆయన సోదరి కన్నుమూత..!

Highlights

KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.

KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి సకలమ్మ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమె.. శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కేసీఆర్‌కు సకలమ్మ 5వ సోదరి. ఆమె స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలోని పెదిర గ్రామం. ఆమె భర్త హనుమంతరావు కొన్నేళ్ల క్రితమే మృతి చెందారు.

సకలమ్మ మరణవార్త తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీశ్‌రావు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. ఆమె అంత్యక్రియలు శనివారం నిర్వహిస్తారని చెబుతున్నారు. సకలమ్మ మరణంపై కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సంతాపాన్ని తెలిపారు.

హైదరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతోపాటు ఇతర ముఖ్య నాయకులతో శనివారం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిర్వహించ తలపెట్టిన సమావేశం వాయిదా పడింది. కేసీఆర్‌ సోదరి సకలమ్మ మృతి నేపథ్యంలో ఈ సమావేశం వాయిదా పడినట్టు బీఆర్‌ఎస్‌ వర్గాలు వర్గాలు వెల్లడించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories