రైతులకు ఎక్సైజ్‌ శాఖ షాక్.. ఆ కుటుంబాలకు రైతు బంధు నిలిపివేత...

Telangana Excise Stopped Rythu Bandhu for Ganja Farming Families | Breaking News
x

రైతులకు ఎక్సైజ్‌ శాఖ షాక్.. ఆ కుటుంబాలకు రైతు బంధు నిలిపివేత...

Highlights

Telangana Excise: *ఎక్సైజ్‌ అధికారుల సిఫారసు, సర్కార్‌కు నివేదిక *లబోదిబోమంటున్న బాధితులు

Telangana Excise: పంట పొలాల్లో గంజాయి సాగు చేసే రైతులకు... తెలంగాణ ఎక్సైజ్ శాఖ షాక్ ఇచ్చింది. గంజాయి సాగు చేసే వారిపై ఉక్కుపాదం మోపాలంటూ.. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో.. అధికారులు కఠిన చర్యలకు రంగం సిద్ధం చేశారు. గంజాయి సాగు చేసే రైతులకు రైతుబంధు నిలిపివేయాలంటూ.. అధికారులు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. సర్కారు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ వ్యాప్తంగా 126 మంది రైతులకు రైతు బంధు నిలిపివేయాలని ఎక్సైజ్ శాఖ సిఫార్సులపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది.

నిజామాబాద్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ఎక్సైజ్- పోలీస్ శాఖలు రంగంలోకి దిగాయి. గంజాయి రవాణా, సాగు చేసే వారిపై దాడులు చేస్తూ.. ఎక్కడికక్కడే అరెస్టులు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కొందరు రైతులు పంట పొలాల్లో అంతర్ పంటగా గంజాయి సాగు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు ఆ గంజాయిని రవాణా చేస్తున్నారు. పంట పొలాల్లో గంజాయి సాగు చేస్తున్న ఐదుగురు రైతు కుటుంబాలను గుర్తించిన ఎక్సైజ్ అధికారులు ఆ రైతులకు రైతుబంధు నిలిపి వేయాలని జిల్లా కలెక్టర్ కు అధికారులు సిఫార్సు చేశారు.

నిజామాబాద్ జిల్లా పరిధిలోని వర్ని మండలం కోకల్‌దాస్ తండా, రుద్రూర్ గ్రామాలకు చెందిన కొందరికి జూన్‌లో వచ్చే రైతుబంధు నిలిపి వేయాలని అధికారులు లేఖలు రాశారు. అయితే ఓ రైతుకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. అంతర్ పంటగా గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎక్సైజ్ అధికారులు కేసులు నమోదు చేసి.. రైతుబంధు నిలిపివేతకు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. ఎక్సైజ్ అధికారుల తీరుపై బాధితులు లబోదిబోమంటున్నారు.

ఆధార్, పాస్ పుస్తకాలు తీసుకుని వివరాలు సర్కారుకు పంపించారని ఆవేదన చెందుతున్నారు. తమకు రైతు బంధు నిలిపి వేయవద్దని సర్కారును వేడుకుంటున్నారు రైతులు. గంజాయి సాగు చేస్తూ పట్టుబడిన 126 మందికి రాష్ట్ర వ్యాప్తంగా.. రైతుబంధు నిలిపివేయాలని.. ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఐదుగురు రైతుల వివరాలను సైతం పంపించారు.

అంతర్ పంటగా గంజాయి సాగు చేసిన వారిని గుర్తించామని, రైతుబంధు పొందుతున్న రైతులను గుర్తించి రైతుబంధు నిలిపి వేతకు సిఫారసు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలం పలు తండాల్లో మూడు కుటుంబాలకు రైతుబంధు నిలిచిపోనుండగా... నిజామాబాద్ లోని వర్ని, రుద్రూరుకు చెందిన ఇద్దరు రైతులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోసారి గంజాయి సాగు చేస్తూ.. పట్టుబడితే పీడీయాక్టు నమోదు చేస్తామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories