కరోనా బాధితులు కంటే .. మందుబాబులే ఎక్కువ..!

కరోనా బాధితులు కంటే .. మందుబాబులే ఎక్కువ..!
x
Representational Image
Highlights

రోనా వైరస్ గంటగంటకూ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేథ్యంలో దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ కొనసాగుతుంది.

కరోనా వైరస్ గంటగంటకూ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేథ్యంలో దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో వైన్స్ షాపులన్నీ మూతపడ్డాయి. మందుబాబులకు తాగడానికి చుక్క మందు లేక అల్లడిపోతున్నారు. గ్రామాల్లో కల్లు దుకాణాలు కూడా మూతపడడంతో.. కల్లు లేక కల్లుప్రియులు సైతం విలవిల్లాడిపోతున్నారు.

కల్లు లేక వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలో చాలా చోట్ల ఇలాంటి ఘటనలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌కు ఓపీ రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనావైరస్ బాధితుల కంటే ఇప్పుడు మద్యం బాధితులే రాష్ట్రంలో ఎక్కువవుతున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇలా మద్యానికి బానిసైన వారి పిచ్చి పిచ్చి వప్రవర్తన ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో తెలంగాణ ఎక్సైజ్ శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మద్యం దుకాణాలు మూసివేయడంతో.. మద్యానికి బానిసలు అయినవారికి మానసిక ఆందోళపై చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులు కీలక సూచనలు చేశారు.

మద్యం దొరక్కపోవడంతో చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్న వారి వివరాలను సేకరించాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్ సమయంలో అన్ని రకాల మద్యం దుకాణాలు మూసివేసి ఉంటాయని స్పష్టం చేశారు. చిత్రంగా ప్రవర్తించే వారికి డిఅడిక్షన్ సెంటర్లలో చికిత్స అందజేయాలని సూచించారు. యోగా, ధ్యానం, ఆధ్యాత్మికం వైపు వారి మనసును మళ్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక బ్లాక్ మార్కెట్‌‌లో మద్యం అమ్మకాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories