KCR: జస్టిస్ నరసింహారెడ్డి కమిటీకి వ్యతిరేకంగా కేసీఆర్ పిటిషన్‌పై నేడే సుప్రీంకోర్టులో విచారణ

telangana-ex-chief-minister-kcr-held-today-in-supreme-court-against-commission-on-power-deals
x

KCR: జస్టిస్ నరసింహారెడ్డి కమిటీకి వ్యతిరేకంగా కేసీఆర్ పిటిషన్‌పై నేడే సుప్రీంకోర్టులో విచారణ

Highlights

KCR: జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఇచ్చిన సమన్లపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై నేడు కీలక విచారణ జరగనుంది.

KCR:తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఛత్తీస్ గఢ్ నుంచి జరిగిన విద్యుత్ కొనుగొళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ జరపడానికి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ కమిషన్ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఈ అంశంపై జూన్ 24న కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్,జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం ముందుకు విచారణకు రానుంది.

అయితే ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థలు వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్ల, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ జరిపించి, ఆ నిర్ణయాల్లోని నిబద్ధతను తేల్చేందుకు రాష్ట్రం ప్రభుత్వం మార్చి 14న జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్ 1952 విద్యుత్ చట్టం 2003కి విరుద్ధమని దాన్ని రద్దు చేయాలని కేసీఆర్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. విద్యుత్ కొనుగోళ్లపై వివాదం ఉంటే తెలంగాణ, ఛత్తీస్ గఢ్ విద్యుత్తు నియంత్రణ మండళ్లు తేల్చాలే తప్పదానిపై విచారించే అధికారం కమిషన్ కు లేదని కేసీఆర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.తాము ఏ తప్పుచేయలేదని చెబుతూ..జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవాలని కోరుతూ 8 పేజీల లేఖ రాశారు కేసీఆర్.

అయితే కేసీఆర్ తీరుపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. అక్రమాలు భయటపడతాయన్న భయంతోనే కేసీఆర్ ఇలా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఎలాంటి తప్పు చేయకపోతే విచారణ ఎదుర్కొవాలని సవాల్ విసిరింది. కానీ కేసీఆర్ ఎలాంటి పరిస్థితుల్లో కమిషన్ ముందుకు వెళ్లకూడదన్న పట్టుదలతో ఉన్నారు. దీంతో న్యాయపరంగా ఎక్కడికైనా వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో నేడు విచారణ ఎలా జరుగుతుందో..అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పు వెలువరుస్తుందో..అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అయితే ఈ తీర్పు ఇవాళ వస్తుందా లేదా మరో రోజు వస్తుందా అనే దానిపై స్పష్టత లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories